Begin typing your search above and press return to search.

బాల‌య్య 'స్వ‌ర్ణోత్స‌వాల‌'కు అతిధులు వీళ్లేనా!

ఇప్ప‌టికే ఆహ్వానితులంద‌రికీ ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డం జ‌రిగింది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:40 AM GMT
బాల‌య్య స్వ‌ర్ణోత్స‌వాల‌కు అతిధులు వీళ్లేనా!
X

న‌ట‌సింహా బాల‌కృష్ణ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కొచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఘ‌నంగా స్వర్ణోత్స‌వాలు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇంకా వేడుక‌కు కొన్ని గంట‌లే స‌యం ఉంది. ఈవేడుక‌కు పెద్ద ఎత్తు సినీ, రాజ‌కీయ ప్రముఖులు హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే ఆహ్వానితులంద‌రికీ ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డం జ‌రిగింది. ప‌రిశ్ర‌మ‌లో ని అన్ని సంఘాలు క‌లిసి వెళ్లి ప్ర‌ముఖుల్ని ఆహ్వానించారు.

ఇంత‌వ‌ర‌కూ ఏ న‌టుడి పేరిట ప‌రిశ్ర‌మ ఇలాంటి వేడుక‌లు నిర్వ‌హించ‌లేదు. తొలిసారి బాల‌య్య‌కే ఆ అవ‌కాశం ద‌క్కింది. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి హాజ‌ర‌య్యే అతిధుల జాబితా ఇలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, అల్ల‌రి న‌రేష‌న్, గోపీచంద్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయిధర‌మ్ తేజ్, అక్కినేని అఖిల్, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వ‌క్ సేన్, శ్రీ విష్ణు, నాగ‌శౌర్య లాంటి హీరోలంతా హాజ‌ర‌వుతున్నారు.ఇంకా స్టార్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు కూడా హాజ‌ర‌వుతారు. ఇంకా ఇండ‌స్ట్రీ కి సంబంధించిన 24 శాఖ‌లు త‌ప్పక పాల్గొంటారు.

అలాగే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి వాళ్లిద్ద‌రు వ‌స్తున్నారా? లేదా? అన్న‌ది ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు ఎవ‌రైనా హాజ‌ర‌వుతారా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.

ఈ షోని హోస్ట్ చేసే బాధ్య‌త‌లు మాత్రం సీనియ‌ర్ యాంక‌ర్ సుమ‌కి అప్ప‌గించారు. ఇలాంటి పెద్ద షోలు అన్ని సుమ యాంక‌రింగ్ చేస్తుంటుంది. మ‌రోసారి అవ‌కాశం ఆమెకే ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.