Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : అందరికీ తెలిసేలా పులిహోర కలుపుతున్న ఆ ఇద్దరు..!

పృధ్వి కూడా ఎలాగు ఏదో ఒకటి కంటెంట్ నడుస్తుంది కదా అని విష్ణు ప్రియని ఎంకరేజ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 5:08 AM GMT
బిగ్ బాస్ 8 : అందరికీ తెలిసేలా పులిహోర కలుపుతున్న ఆ ఇద్దరు..!
X

బిగ్ బాస్ మొదలైంది అంటే అందులో సోలోగా ఉన్న ఎవరైనా ఈ రెండు మూడు నెలలు తోడుని వెతుక్కుంటారని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఈ పులిహోర కహానీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో యాంకర్ విష్ణు ప్రియ, పృధ్విల లవ్ స్టోరీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారుతుంది. విష్ణు ప్రియ నిజంగానే పృధ్వి మీద చాలా ప్రేమ చూపిస్తుంది. ఐతే అంతకుముందు ఇదంతా కంటెంట్ కోసమే అని ఆమె చెప్పినట్టు టాక్. పృధ్వి కూడా ఎలాగు ఏదో ఒకటి కంటెంట్ నడుస్తుంది కదా అని విష్ణు ప్రియని ఎంకరేజ్ చేస్తున్నాడు.

ఐతే లేటెస్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి కాబట్టి వీరిలో ఎవరైనా పాత కంటెస్టెంట్స్ తో కనెక్ట్ అవుతారేమో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతానికైతే విష్ణు ప్రియ, పృధ్విల లవ్ స్టోరీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఐతే విష్ణు ప్రియ కావాలని పృధ్విని పాంపర్ చేస్తుంది.. అతని మీద ప్రేమ చూపిస్తుంది కానీ పృధ్వి సైడ్ నుంచి అది అంతగా ఏమి లేదని అర్థమవుతుంది.

మరోపక్క హౌస్ లో ఉన్న యష్మి, సీత కూడా పృధ్వి మీద ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సోనియా ఉన్నంతకాలం ఆమె వెంటే ఈ పృధ్వి, నిఖిల్ ఉన్నారు. సోనియా వెళ్లాక పృధ్వి, నిఖిల్ ఇద్దరు అందరితో కలుస్తున్నారు. ముఖ్యంగా పృధ్వి ఎక్కువ కలుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ జరుగుతుంది. రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ రెండు క్లాన్స్ తమకు ఇచ్చిన పాత్రలను పోషిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఈ వారం నామినేషన్స్ గురించి చూస్తే.. ఓజీ క్లాన్ నుంచి విష్ణు ప్రియ, సీత, యష్మి, పృధ్వి ఉండగా రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు హౌస్ ని వీడి బయటకు వచ్చేస్తారన్నది చూడాలి. సీజన్ 8 లో గడిచిన ఐదు వారాలు అలా అలా సాగినట్టు అనిపించగా ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్ మెంట్ పాళ్లు ఎక్కువైనట్టే అనిపిస్తుంది. ఇక రాయల్, ఓజీ క్లాన్స్ మధ్య టాస్కులు కూడా పెడుతున్నారు కాబట్టి ఆట మరింత రసవత్తరంగా మారనుందని చెప్పొచ్చు.