Begin typing your search above and press return to search.

టాప్ డైరెక్ట‌ర్స్ బెస్టీస్ వీరేనంటున్నారు!

మ‌రి టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కొంద‌రిలో అలాంటి బెస్ట్ స్నేహితులు క‌ల‌వారు ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

By:  Tupaki Desk   |   4 May 2024 11:30 PM GMT
టాప్ డైరెక్ట‌ర్స్ బెస్టీస్ వీరేనంటున్నారు!
X

ప్ర‌తీ ఒక్క‌రికి బెస్ట్ ప్రెండ్స్ అంటూ కొంద‌రుంటారు. వాళ్ల లైఫ్ లో వాళ్లెంతో ప్ర‌త్యేకంగా ఉంటారు. ఎంత‌మంది స్నేహితులున్నా! ఒక‌రిద్ద‌రు మాత్రం ఎక్కువ‌గా హైలైట్ అవుతుంటారు. మ‌రి టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కొంద‌రిలో అలాంటి బెస్ట్ స్నేహితులు క‌ల‌వారు ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. రాజ‌మౌళి..అనీల్ రావిపూడి..కొర‌టాల శివ‌..వంశీ పైడిప‌ల్లి... గోపీచంద్ మ‌లినేని ఇలా కొంద‌రు బెస్ట్ ప్రెండ్స్ గురించి చూస్తే.

గోపీచంద్ మ‌లినేని కి ప‌రిశ్ర‌మలో చాలా మంది స్నేహితులున్నారుట‌. అందులో అనీల్ రావిపూడి ..కొర‌టాల శివ క్లోజ్ గా ఉంటార‌న్నారు. రాజ‌మౌళి నైతే మెంటార్ గా భావిస్తారుట‌. ఇక‌ అనీల్ రావిపూడికి గోపీ చంద్ మ‌లినేని- వంశీ పైడిప‌ల్లి బాగా క్లోజ్ గా ఉంటారన్నారు. అలాగే సెన్సిబుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల కైతే బీవీఎస్ ర‌వి..నిర్మాత సుధాక‌ర్ స్నేహితులుట‌. వీళ్లంతా బ్యాచ్ మెట్స్అట‌. క‌లిసి చదువుకున్న వాళ్ల‌మ‌ని కొర‌టాల‌ తెలిపారు. ఇక రాజ‌మౌళి విష‌యానికి వ‌స్తే తార‌క్ ని ప్రెండ్ అన‌డం కంటే త‌మ్ముడు అన‌డం ఇష్టం అన్నారు.

అతన్ని ప‌క్క‌న‌బెడితే సాయి కొర్ర‌పాటి- శోభూయార్ల‌గ‌డ్డ జ‌క్క‌న్న‌కు చాలా క్లోజ్ అన్నారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి చాలా కాలం వ‌ర‌కూ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ ప్రెండ్స్ అంటూ ఎవ‌రూ లేరు. `ఊపిరి` సినిమా చూసిన త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి క‌నెక్ట్ అయ్యారు. అప్పుడే మ‌హేష్ పిలిచి మ‌రీ క‌థ చెప్ప‌మ‌ని అడిగితే వంశీ `మ‌హ‌ర్షి` క‌థ చెప్ప‌డం..అది మ‌హేష్ కి బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో ఇద్ద‌రు క్లోజ్ అయ్యారన్నారు. ఆ సినిమా హిట్ త‌ర్వాత ఇద్ద‌రూ బెస్ట్ ప్రెండ్స్ గా మారిపోయారు.

అప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ ని మీ బెస్ట్ ప్రెండ్ ఎవ‌రు? అని అడిగితే ఇక్క‌డ లేర‌ని చెన్నై లో చిన్న నాటి స్నేహితులు ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉన్నార‌న్నారు. ఇప్పుడా లోటును వంశీ పైడిప‌ల్లి తీరుస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ నుంచి మ‌హేష్ ఎక్కువ‌గా అభిమానించేది విక్ట‌రీ వెంక‌టేష్ ని మాత్ర‌మే. ఎంత మంది న‌టులున్నా త‌న‌కి వెంక‌టేష్ అంటే స్పెష‌ల్ అంటారు. పూరి జ‌గ‌న్నాధ్-రాంగోపాల్ వ‌ర్మ కూడా బెస్ట్ ప్రెండ్స్. వాస్త‌వానికి ఇద్ద‌రు గురు శిష్యులు. కానీ వాళ్ల అభిరుచులు ఒకేలా ఉండ‌టంతో ఇద్ద‌రు మంచి స్నేహితుల‌య్యారు.