యాటిట్యూడ్ తోనే ఆ ఇద్దరు పాపులర్!
ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తో 10 సినిమాలు సక్సెస్ అయితే వచ్చినంత గుర్తింపును దక్కించుకున్నాడు. ఒక్క వెబ్ సిరీస్ తో తానేంటో నిరూపించుకున్నాడు.
By: Tupaki Desk | 16 March 2024 6:42 AM GMTఅనుదీప్.కె.వి...ఆదిత్య హాసన్ ఇప్పుడు పరిచయం అవసరం లేని పేర్లు. 'పిట్టగొడ'తో అనుదీప్ లాంచ్ అయినా అటుపై 'జాతిరత్నాలు' హిట్ తో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఇక ఆదిత్య హాస్ తెరకెక్కించింది ఒకే ఒక్క వెబ్ సిరీస్. అదే '# 90 స్ బయోపిక్'. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తో 10 సినిమాలు సక్సెస్ అయితే వచ్చినంత గుర్తింపును దక్కించుకున్నాడు. ఒక్క వెబ్ సిరీస్ తో తానేంటో నిరూపించుకున్నాడు.
అయితే ఇద్దరు హీరోల సినిమాలకంటే ఎక్కువగా యాటిట్యూడ్ తోనే పాపులర్ అవుతున్నారు. అనుదీప్ కె.వి జాతిరత్నాలు రిలీజ్ సమయంలో తనని తాను ఎలా ప్రమోట్ చేసుకున్నాడో తెలిసిందే. వివిధ ఇంటర్వ్యూలకు రొటీన్ కి భిన్నంగా హాజరవ్వడం..వింతైన సమాధానాలు చెప్పడంతో ఎక్కువగా గుర్తింపు దక్కింది. తన సినిమా రిలీజ్ కి ముందే తనలో హాస్యాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు. అంతకు ముందు 'పిట్టగోడ' సినిమాతోనే ఇలా ట్రై చేసాడు గానీ వర్కౌట్ అవ్వలేదు.
కానీ జాతిరత్నాలు అతని జీవితాన్నే మార్చేసిన చిత్రంగా నిలిచింది. అందులో డైలాగులు...నటుల పెర్పార్మెన్స్ వెనుక అసలు వ్యక్తి కెప్టెన్ కావడంతో తన యాటిట్యూడ్ ఇలాగే ఉంటుందని ప్రేక్షకులు పట్టేసారు. అది అనుదీప్ పాపులారిటీ కీ అంశంగా మారింది. యూట్యూబ్ షార్ట్స్..ర్యాపిడ్ ఫైర్ లాంటివి అతన్ని మరింత ఫోకస్ చేసాయి. ఇక ఆదిత్య హాసన్ చూడటానికి సెన్సిటివ్ గా కనిపించినా అతడిలోనూ కామెడీ టింజ్ ఊహించనంత ఉందని 90 స్ బయోపిక్ ద్వారా తెలుస్తుంది.
ఆ వెబ్ సిరీస్ ని అతడు తెరకెక్కించిన విధానం..మేకింగ్ స్టైల్ ప్రతిది ఆదిత్య ప్రతిభను చాటింది. వ్యక్తిగ తంగా అతడిలో సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? అన్నది సిరీస్ ద్వారా చెప్పొచ్చు. అందులో కామెడీ సన్నివేశాలు..ఎమోషన్ ప్రతిది ఆడియన్స్ కి ఎంతో కనెక్ట్ అయింది. రిలీజ్ అనంతరం నెట్టింట అవి ప్రచారమైన తీరు...దక్కిన ఆదరణ ప్రతీది ఆదిత్య హాసన్ ప్రతిభని చాటుతున్నావే.