ఊ అంటావా సింగర్.. ఇదేమి పరిస్థితో?
దీంతో ఇంద్రావతి మళ్ళీ ఊ అంటావా సాంగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతుంది అనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 25 Oct 2023 10:41 AM GMTపుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. సినిమాకి హైప్ తీసుకురావడంతో ఈ ఐటెం సాంగ్ భాగా ఉపయోగపడింది. ఇప్పటికి సోషల్ మీడియాలో ఊ అంటావా సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. అంతలా జనాల్లోకి ఆ సాంగ్ వెళ్ళిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఇంద్రావతి హస్కీ వాయిస్ తోడు కావడంతో సాంగ్ ఎక్కడికో వెళ్ళింది.
స్టార్ సింగర్ మంగ్లీ చెల్లెలు అయిన ఇంద్రావతికి గాయనిగా సినిమాల్లో అదే మొదటి సాంగ్. ఈ ఒక్క సాంగ్ తో రాత్రికి రాత్రి ఇంద్రావతి పాపుల అయిపొయింది. అక్కని మించి ఇమేజ్ వచ్చేసింది. దేవిశ్రీ ఫ్రెష్ గొంతుతో పాడించాలని అనుకోవడం కూడా ఆ సాంగ్ కి ప్లస్ అయ్యింది. ఇంద్రావతిని ఊ అంటావా సాంగ్ స్టార్ గాయనిగా మార్చేసింది.
దీని తర్వాత బెనారస్, అన్ స్టాపబుల్, పెర్ఫ్యూమ్, అలా నిన్ను చేరి వంటి సినిమాలలో ఇంద్రావతి సాంగ్స్ పాడింది. అయితే ఇవేవీ కూడా జనాలకి పెద్దగా రిజిస్టర్ కాలేదు. తాజాగా కార్తి జపాన్ సినిమాలో సినిమాలో ఓ సాంగ్ పాడింది. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిత్రంలో లీలమ్మో సాంగ్ కూడా ఇంద్రావతి గొంతు నుంచి రాబోతోంది.
ఈ సాంగ్ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇంద్రావతి గొంతులో ఉంటే టెంపోని దేవిశ్రీ తర్వాత ఆ స్థాయిలో ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ వినియోగించుకోలేదని చెప్పాలి. ఆదికేశవ సినిమాలోని లీలమ్మో సాంగ్ లో ఊపు ఉన్న కూడా ఇంద్రావతి గొంతు నుంచి స్వరాలు మాత్రం స్పష్టంగా వినిపించడం లేదు.
దీంతో ఇంద్రావతి మళ్ళీ ఊ అంటావా సాంగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతుంది అనే మాట వినిపిస్తోంది. ఇంద్రావతి అంటే ఇప్పటికి ఆ సాంగ్ మాత్రమే అందరికి గుర్తుకొస్తోంది. దానిని బీట్ చేసే స్థాయిలో సాంగ్ ఆమె నుంచి ఇంకెప్పుడు వస్తుందో చూడాలి.