2023 చివరి శుక్రవారం పరిస్థితి ఏంటి?
500 కోట్లు..1000 కోట్ల వసూళ్లతో ఎన్నడు లేనంతగా 2023 ఇయర్ లో భారీ నెంబర్లు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 31 Dec 2023 7:38 PM GMT2023 బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్ నుంచి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో సరికొత్త రికార్డు నమోదైంది. 500 కోట్లు..1000 కోట్ల వసూళ్లతో ఎన్నడు లేనంతగా 2023 ఇయర్ లో భారీ నెంబర్లు నమోదయ్యాయి. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయిన ఏడాదిగా మిగిలిపోతుంది. 2023 విజయాల రికార్డును బ్రేక్ చేయడం అంటే అంత వీజీ కాదు.
అంతకు మించిన అద్భుతమైన చిత్రాలు రిలీజ్ అయితే తప్ప సాధ్యం కాని పని. 2024 లోకొన్ని అగ్ర హీరోల సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి. కానీ సంఖ్య తక్కువగా ఉంటటంతో వీలుపడే ఛాన్స్ లేదు. సినిమాల నెంబర్ పెరిగి విజయాలు నమోదైతే తప్ప! సాద్యం కానీ సన్నివేశం కనిపిస్తోంది. మరి 2023 చివరి శుక్రవారం ఎలా ముగిసింది? అంటే కాస్త చప్పగానే కనిపిస్తోంది. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ `డెవిల్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది.
సినిమా అబౌ యావరేజ్ హిట్ గా నిలిచింది. స్సై జోనర్ కావడంతో అంచనాలు పీక్స్ లో మొదలయ్యాయి. కానీ కథ..కథనాల్లో కొన్ని విమర్శలొచ్చాయి. ఆ రకంగా సినిమాకి డివైడ్ టాక్ కనిపిస్తుంది. అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా..అతని పాత్రని వైవిథ్యంగా చెప్పొచ్చు. ఇక సుమ-రాజీవ్ కనకాల కొడుకు రోషన్ `బబుల్ గమ్` సినిమాతో అదే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. కుర్రాడిలో ఈజ్ ఉంది కానీ కంటెంట్ వీక్ గా అనిపించింది. రొటీన్ సినిమా అనే ముద్ర పడిపోయింది. అయితే రోషన్ రిలీజ్ కి ముందు చాలా కాన్పిడెంట్ గా కనిపిం చాడు. తనపై వచ్చిన నెగిటివిటీని పొగొట్టుకునేలా తన సినిమాలు..కమిట్ మెంట్ ఉంటుందన్నాడు. కానీ సినిమాలో అదెక్కడా కనిపించలేదు.