Begin typing your search above and press return to search.

లండ‌న్‌లో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న స్టార్ హీరోయిన్

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా అందించిన వివ‌రాల ప్ర‌కారం.. అనుష్క శ‌ర్మ‌ అక్కడ తన బిడ్డకు జన్మనివ్వబోతోంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 3:24 PM GMT
లండ‌న్‌లో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న స్టార్ హీరోయిన్
X

చాలా కాలం పాటు డేటింగ్ చేసి 2017లో పెళ్లి చేసుకున్న విరాట్ - అనుష్క శ‌ర్మ‌ 2021లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఈ దంప‌తులు తమ ఆడబిడ్డకు వామిక అని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం వామిక పెరిగి పెద్ద‌దైపోతోంది. ఇప్పుడు ఈ జంట‌ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో విరట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా అందించిన వివ‌రాల ప్ర‌కారం.. అనుష్క శ‌ర్మ‌ అక్కడ తన బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఫిబ్రవరి 13న హర్ష్ తన X హ్యాండిల్ నుండి నిగూఢ‌మైన‌ ట్వీట్‌తో సోషల్ మీడియాలో చమత్క‌రించారు. ట్వీట్‌లో అతడు విరుష్క దంప‌తులు త్వరలో తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు వెల్ల‌డించాడు. వ్యాపారవేత్త అయిన హ‌ర్ష్‌.. శిశువు భ‌విష్యత్తు, కెరీర్ మార్గం గురించి సరదాగా ఊహించాడు. పిల్లవాడు క్రికెటర్ అవుతాడు లేదా బాలీవుడ్ లో స్టార్ అవుతాడంటూ ఛ‌మ‌త్క‌రించాడు. త‌ద్వారా ఆ బిడ్డ‌ తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించవచ్చని సూచించాడు. అయితే అతడు సెలబ్రిటీ క‌పుల్ పేరును మాత్రం రివీల్ చేయ‌లేదు.

మునుముందు కొద్ది రోజుల్లో కొత్త శిశువు పుట్టబోతోంది! ఈ పాప భారత్‌ను గొప్ప క్రికెట‌ర్ డాడ్ లా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాను. లేక తల్లిని ఫాలో అయి సినిమా స్టార్ అవుతుందా? చూడాలి. #MadeInIndia #ToBeBornInLondon అని ట్వీట్ చేసారు. దీంతో పాపాయి జ‌న్మించేది లండ‌న్ లో అని వెల్ల‌డైంది.

హ‌ర్ష్ గోయేంకా ఈ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే దానికి నెటిజన్ల నుండి అనూహ్య‌ స్పందనలు కామెంట్‌లు వచ్చాయి. ``లేదా శిశువు తన తల్లిదండ్రుల విజయాల భారాన్ని మోయకుండా సాధారణ వ్యక్తిగా కూడా ఉండవచ్చు`` అని ఒకరు రాసారు. ఎప్పుడూ చేయకూడని పనుల కోసం పుట్టబోయే బిడ్డపై భారం వేయడమా? జీవితం దాని సహజ మార్గంలో వర్ధిల్లాలి! అని మ‌రొక‌రు రాసారు.

3 ఫిబ్రవరి 2024న టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ గైర్హాజరు కావడంపై చర్చిస్తూ AB డివిలియర్స్ ఒక యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేశాడు. భారత క్రికెటర్ విరాట్ వ్యక్తిగత జీవితంలో అంతా బాగానే ఉందని వీక్షకులకు భరోసా ఇచ్చాడు. ఎబి డివిలియర్స్ విరాట్ తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు మెచ్చుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ అత‌డి భార్య అనుష్క శర్మ తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. అనుష్క‌ కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నందున అనుష్క -ఆమె భర్త విదేశాలకు వెళ్లినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ జంట వైపు నుండి ఇంకా ఎలాంటి ఊహాగానాలపై అధికారిక ధృవీకరణ లేదా స్పష్టత లేదు.