అభిమానుల్ని మరోసారి సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరో!
ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.
By: Tupaki Desk | 24 Dec 2023 1:30 AM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్ ఇతర దర్శకులతో సినిమాలు చేస్తూనే స్వీయా దర్శకత్వంలో వేగం పెంచుతు న్నాడు. ఇప్పటికే డి50 షూటింగ్ పూర్తి చేసి..శేఖర్ కమ్ములా సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన స్వీయా దర్శకత్వంలో మూడవ ప్రాజెక్ట్ ని కూడా ప్రకటించి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసాడు.
`డిడి3` అనే వర్కింగ్ టైటిల్ తో మరో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ట్విటర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ని షేర్ చేసాడు. పోస్టర్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నీలిరంగు సముద్రం..ఆకాశం డిజైన్ తో కూడిన పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అందమైన లొకేషన్ నడుమ కూర్చుని సేద తీరడానికి ఓ బెంచీ డిజైన్ అద్బుతంగా ఉంది. డి అక్షరాన్ని పొలి ఉండే రెండు నెలవంకలు తన మూడు వెంచర్ కి సింబాలిక్ గా 3 నెంబర్ వచ్చేలా చక్కగా డిజైన్ చేసారు.
కాన్సెప్ట్ పోస్టర్ కి ఎడమవైపుగా వండర్ బార్ ఫిల్మ్స్ లోగో కూడా ఉంది. అంటే ఈ సినిమాని ధనుష్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు మించి ప్రాజెక్ట్ గురించి ఇంకే వివరాలు రివీల్ చేయలేదు. 24 అనగా ఆదివారం అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు అందులో తేదీ మెన్షన్ చేసారు. ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్న వారందరికీ ధనుష్ కృతజ్ఞతలు తెలియజేసాడు.
మరి ఇందులో ఇతర నటీనటులు ఎవరు? కథా కమామీషు ఏంటి? అన్నది ఆదివారం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుష్ `కెప్టెన్ మిల్లర్` ...డి 50 చిత్రాలు షూటింగ్ పూర్తి చేసాడు. అవి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలో శేఖర్ కమ్ములా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆ సినిమా లో తన పోర్షన్ పూర్తయిన వెంటనే ప్రకటించిన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు.