తెరపైకి మరో 'ఘాజీ' రెడీ అవుతోందా?
తాజాగా 'ఘాజీ' నేపథ్యంలోనే మరో సినిమాకి రంగం సిద్దమవుతోంది. 'ఆపరేషన్ ట్రిడెంట్' ఆధారంగా 'ది ట్రిడెంట' టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరపైకి తెస్తున్నారు.
By: Tupaki Desk | 27 Jan 2024 3:30 PM GMTటాలీవుడ్ 'ఘాజీ' ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. జాతీయ అవార్డు సైతం అందుకుని ఘాజీ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. విశాఖ పట్టణం సముద్ర గర్భంలో జరిగిన రెండు సబ్ మెరైన్ల మధ్య ఆసక్తికర పోరు ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. అప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి ప్రయోగం ఏ దర్శకుడు చేయలేదు. తొలిసారి ఓ తెలుగు కుర్రాడు ( సంకల్ప్ రెడ్డి) ఈ నేపథ్యాన్ని ఎంపిక చేసుకుని సినిమా చేసి భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే తనకంటూ ఓ గుర్తింపును దక్కించు కున్నాడు.
తాజాగా 'ఘాజీ' నేపథ్యంలోనే మరో సినిమాకి రంగం సిద్దమవుతోంది. 'ఆపరేషన్ ట్రిడెంట్' ఆధారంగా 'ది ట్రిడెంట' టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరపైకి తెస్తున్నారు. అత్యంత సాహసోపేతమైన సముద్ర యుద్ద కార్యక లాపాల్లో విజయం సాధించిన ఆపరేషన్ ట్రెడెంట్ ని బేస్ చేసుకున్ని దీన్ని తెరకెక్కిస్తున్నారు. విక్రమాదిత్య మోత్వాన్ని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1971 లో బబ్రూబాన్ యాదవ్- ఆడ్మిరల్ నందా నేతృత్వంలో విజయవంతమైన ఆపరేషన్ ట్రిడెంట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోల్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారం భిం చాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందు కొస్తున్నారు. దీంతో బాలీవుడ్ నుంచి రాబోతున్న మరో దేశ భక్తి చిత్రంగా 'ది ట్రిడెంట్' నిలుస్తుంది.
ఇప్పటివరకూ ఎక్కువగా భూమీపై జరిగే యుద్దాల నేపథ్యంలో దేశ భక్తిని చాటి చెప్పే ప్రయత్నం చేసారు. అలాగే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన 'ఫైటర్' ఆ కోవకు చెందినదే. అయితే సముద్ర గర్భంలో యుద్దాలు మాత్రం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. 'ఘాజీ' సక్సస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడు తున్నాయి.