రెండూ 2025 లోనేనా పవన్ జీ!
అసెంబ్లీకి పంపించడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారు.
By: Tupaki Desk | 4 Aug 2024 9:32 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలు పూర్తి చేసేదెప్పుడు? ఎప్పటి నుంచి పవన్ జీ మళ్లీ డేట్లు కేటాయిస్తారు? పూర్తి చేసి వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కొత్త సినిమాల సంగతేంటి? ఇలా చాలా ప్రశ్నలే అభిమానుల్లో తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ని రాజకీయాల్లో సక్సెస్ చేయాలనుకున్నారు అభిమానులు చేసి చూపించారు. అసెంబ్లీకి పంపించడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారు.
దీంతో పవన్ కళ్యాణ్ సంతోషపడ్డారు. మరి అభిమానుల సంగతేంటి? అన్నదే ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ లో `ఓజీ` ని పూర్తి చేసి రిలీజ్ చేస్తామని నిర్మాత అన్నారు. కానీ అది సాధ్యం కాదని తేలి పోయింది. సెప్టెంబర్ లోకూడా ఏదో ప్రచారం చిత్రం రిలీజ్ చేసి అభిమానుల్నిసంతృప్తి పరచడం తప్ప! చేసేందే లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమా పెండింగ్ షూటింగ్ కి డేట్లు కేటాయించి..షూట్ కి హాజరైతే సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్, డిసెంబర్లోనైనా రిలీజ్ కి అవకాశం ఉండేది.
కానీ ఆ అవకాశం కనిపించలేదు. ఇంతవరకూ పవన్ నోట సినిమా అనే మాట రాలేదు. నిత్యం పాలన పరంగా బిజీగా ఉండటం తప్ప సినిమా గురించి ఇంతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. ఓజీ పరిస్థితే ఇలా ఉందంటే? హరి హర వీరమల్లు సంగతేంటి? అంటూ ఆ విషయం పెరుమాళ్లకే తెలియాలి. ఓజీ అంత వీజీగానూ ఆసినిమా షూటింగ్ పూర్తి చేయడం కుదరదు. సోషియా ఫాంటసీ సినిమా కాబట్టి ఎంతో ఫోకస్ గా పనిచేయాల్సిన సినిమా అది.
ఈ నేపథ్యంలో ఓజీ, హరిహర వీరమల్లు రెండు సినిమాల రిలీజ్ 2025లో నేనే ఓ లీక్ అందింది. 2025 ద్వితియార్ధంలో ఓజీ...ఏడాది చివర హరిమర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశా లున్నాయని వినిపిస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? 2025 మిడ్ లోనే సురేందర్ రెడ్డి కమిట్ అయిన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని పవన్ భావిస్తున్నారుట.