Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి హీరోలకి హిట్ పడాల్సిందే

ఈ సినిమాకి ఎవరేజ్ టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   2 March 2024 4:12 AM GMT
ఆ ఇద్దరి హీరోలకి హిట్ పడాల్సిందే
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ నెల తమ అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పై పరీక్షించుకుంటున్నారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీతో మార్చి 1న థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ సినిమాకి ఎవరేజ్ టాక్ వస్తోంది. విజువలైజేషన్, వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. స్టొరీ పరంగా మాత్రం ఎవరేజ్ మార్కులు తెచ్చుకుంది.

ఈ మూవీ ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది అప్పుడే చెప్పలేం. వరుణ్ తేజ్ దీనికంటే ముందుగా గని, గాండీవదారి అర్జున సినిమాలతో రెండు పెద్ద డిజాస్టర్ లని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాల కారణంగా వరుణ్ తేజ్ మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. ఆపరేషన్ వాలంటైన్ తో కచ్చితంగా అతనికి మంచి హిట్ కావాల్సి ఉంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి అయితే ఇంతకంటే దారుణంగా ఉంది. అతనికి చివరిగా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. లౌక్యం తర్వాత ఇప్పటి వరకు 10 సినిమాలతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వీటిలో కొన్ని ఎవరేజ్ టాక్ తెచ్చుకోగా కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ అయ్యాయి. సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకి ప్రాఫిట్ తీసుకొచ్చిన మూవీ ఒకటి కూడా లేదు.

గోపీచంద్ మాస్ ఇమేజ్ ఇప్పటి వరకు అతనికి అవకాశాలు తెచ్చి పెడుతుంది. ఈ సారి మాస్ కి అదనంగా ఫాంటసీ యాడ్ చేసి భీమా మూవీ చేశాడు. ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న ఏ హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో అయితే భీమా చేయలేదని అర్ధమవుతోంది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫాంటసీ థ్రిల్లర్ మూవీస్ కి ఆడియన్స్ పెద్దపీట వేస్తున్నారు. అందుకే గోపీచంద్ కూడా భీమాతో హిట్ కొడతాడనే మాట వినిపిస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం మ్యాచో స్టార్ గా తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటాడు. ఈ మూవీతో గోపీచంద్ కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ పడాల్సిందే అనే మాట వినిపిస్తోంది.