Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - నీల్ మూవీ... రెండు ఇంట్రస్టింగ్‌ రూమర్స్‌

వీరిద్దరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు దాదాపు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 11:30 AM GMT
ఎన్టీఆర్ - నీల్ మూవీ... రెండు ఇంట్రస్టింగ్‌ రూమర్స్‌
X

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ నుంచి ఇదే ఏడాది సినిమా ప్రారంభం కాబోతుంది అంటూ వచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది.

వీరిద్దరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు దాదాపు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ను ఇదే ఏడాదిలో ప్రారంభించబోతున్నాం అంటూ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రకటనతో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

ఇదే సమయంలో సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని పుకార్లలో కొంత నిజం ఉందేమో అనిపిస్తూ ఉంది. తాజాగా వినిపిస్తున్న రెండు పుకార్లు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉన్నాయి. ఈ రెండు పుకార్లు నిజం అవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు.

ఇంతకు ఆ పుకార్లు ఏంటి అంటే.. మొదటిది ఈ సినిమాలో ఎన్టీఆర్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ చూపించే విధంగా కథ ఉంటుందట. ఒక పాత్ర మరీ వైల్డ్‌ గా ఉండటంతో పాటు కాస్త నెగటివ్‌ టచ్ తో ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కి జోడీగా ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందట. ఈ రెండు పుకార్లు సినిమా పై జనాల్లో ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే విధంగా వీరి కాంబో ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ఏడాదిలో సినిమా ప్రారంభం అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థం కు సినిమా విడుదల అవ్వడం ఖాయం గా సమాచారం అందుతోంది.