హైదరాబాద్ లోని ఓ ఊర మాస్ థియేటర్‌లో కూచుని దొంగ చాటుగా 'సలార్'ని చూశాడట
నిజానికి హైదరాబాద్ లోని ఏదైనా మల్టీప్లెక్స్ లో సినిమా చూద్దామని వైభవ్ తో పాటు వెంకట్ ప్రభు విజయ్ కి సూచించారు.
By: Tupaki Desk | 2 Sep 2024 3:56 AM GMTఅవును.. పరిశ్రమ అగ్రహీరో.. దాదాపు 220కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో.. 'సలార్' మూవీని దొంగ చాటుగా చూసారు. తన ముఖం ఎవరికీ కనిపించకుండా దాచేసి, మాస్కులు వేసుకుని మరీ సింగిల్ థియేటర్‌లోని సెకండ్ క్లాస్ లో కూచుని మరీ సినిమాని వీక్షించాడట.
ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) దర్శకుడు వెంకట్ ప్రభు, సహనటుడు వైభవ్ లతో కలిసి దళపతి విజయ్ ఈ ఫీట్ వేసాడు. అది కూడా హైదరాబాద్ లోని ఓ ఊర మాస్ థియేటర్‌లో కూచుని మరీ `సలార్` సినిమాని వీక్షించాడట.
నిజానికి హైదరాబాద్ లోని ఏదైనా మల్టీప్లెక్స్ లో సినిమా చూద్దామని వైభవ్ తో పాటు వెంకట్ ప్రభు విజయ్ కి సూచించారు. కానీ దానికి అతడు నో అనేశాడట. తీరా థియేటర్ కి వెళ్లాక మూడో తరగతిలో కూచుని సినిమా చూడాల్సి రావడంతో పొరపాటున ఏ- క్లాస్ బదులుగా రెండో తరగతి టికెట్లు చేతికి వచ్చాయా? అని సందేహించాడట వైభవ్. కానీ విజయ్ దానిని అలా ప్లాన్ చేసాడని తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా రివీల్ చేసాడు.
గత డిసెంబర్ లో ప్రభాస్ నటించిన సలార్ .. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీతో పోటీపడి థియేటర్లలోకి విడుదలైంది. ఆ రెండిటిలో సలార్ కే విజయ్ ఓటు వేసాడని కూడా వైభవ్ చెప్పాడు. మొత్తానికి విజయ్ ఒక మాస్ యాక్షన్ సినిమాని సింగిల్ స్క్రీన్ థియేటర్ లో సామాన్య ప్రేక్షకుల మధ్య కూచుని చూడటం నిజంగా గ్రేట్. అయితే ఎవరికీ తానెవరో తెలియనివ్వకుండా మాస్క్ వేయడంతో ఇది సాధ్యపడింది.
మరోవైపు సలార్ మూవీ మాస్ కి ఒక రేంజులో ఎక్కింది. ప్రభాస్ కెరీర్ లో 800 కోట్ల క్లబ్ చిత్రమిది. దళపతి విజయ్ ఇంకా ఆ రేంజుకు చేరుకోలేదు. అతడికి పాన్ ఇండియాలో ఆ రేంజు హిట్టు పడలేదు. ఎలాగైనా కొట్టాలని కసిగా ఉన్నాడు. అందుకే అతడు ప్రభాస్ ని నిశితంగా పరిశీలిస్తున్నాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక మాస్ థియేటర్ లో ప్రభాస్ కి క్రేజ్ ఎలా ఉంది? అనేది అతడు చూడాలనుకున్నాడు. అందుకే సింగిల్ స్క్రీన్ లో సెకండ్ క్లాస్ టికెట్ లో స్క్రీన్ కి ముందుగా కూచుని సలార్ సినిమాని చూసాడు. అతడు ముఖ్యంగా ఆడియెన్ రెస్పాన్స్ ఎలా ఉందో గ్రహించేందుకు ఏర్పాటుతో వచ్చాడన్నమాట! అదీ దాని వెనక మతలబు!!