Begin typing your search above and press return to search.

'A' స‌ర్టిఫికెట్ అడిగి మ‌రీ తీసుకుంటున్నారా?

అయితే ఇప్పుడు అదే ఏ స‌ర్టిఫికెట్ ని కొంత మంది నిర్మాత‌లు కావాల‌ని అడిగి మ‌రీ మాకు ఏ స‌ర్టిపికెట్ ఇవ్వండ‌ని తీసుకుంటున్నారుట‌.

By:  Tupaki Desk   |   9 March 2024 3:30 PM GMT
A స‌ర్టిఫికెట్ అడిగి మ‌రీ తీసుకుంటున్నారా?
X

కంటెంట్ ఆధారంగా సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తుంది. అందులో `ఏ` స‌ర్టిఫికెట్ వ‌చ్చిందంటే? ఆ సినిమా చూసే విష‌యంలో కొన్ని కండీష‌న్లు అప్లై అవుతుంటాయి. చిన్న పిల్ల‌లు థియేట‌ర్ల‌లో ఏ స‌ర్టిఫికెట్ సినిమా చూసే అవ‌కాశం ఉండ‌దు. కొన్ని ప్ర‌త్యేక కండీష‌న్లు అక్క‌డ ప‌నిచేస్తుంటాయి. దీంతో సినిమాపై ఆ ప్ర‌భావం కొంత వ‌ర‌కూ ప‌డుతుంది. వ‌సూళ్ల ప‌రంగా కొంత న‌ష్టం ఉంటుంది.అయితే ఇప్పుడు అదే ఏ స‌ర్టిఫికెట్ ని కొంత మంది నిర్మాత‌లు కావాల‌ని అడిగి మ‌రీ మాకు ఏ స‌ర్టిపికెట్ ఇవ్వండ‌ని తీసుకుంటున్నారుట‌.

ఏ స‌ర్టిఫికెట్ తోనే త‌మ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయ‌నే ఉద్దేశంతో నిర్మాత‌లు ఏ జోలికి వెళ్తున్న‌ట్లు తాజాగా లీకైంది. త‌మ సినిమా వేరే స‌ర్టిఫికెట్స్ కి అర్హత ఉన్నా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ `ఏ` తీసుకుంటు న్నారుట‌. మ‌రి `ఏ` స‌ర్టిఫికెట్ కోసం ఎందుకు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు? అంటే ఏ స‌ర్టిఫికెట్ సినిమాలో ఏదో ఉంద‌నే ఆశ‌తోనే థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. సాధార‌ణ స‌ర్టిఫికెట్ కంటే `ఏ` ఉంటే అందులో అస‌భ్య‌తో..హింస‌నో..మ‌రొక‌టి ఏదో సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని ఆడియ‌న్స్ భావించి ఆ సినిమావైపు ఆస‌క్తి చూపిస్తున్నారుట‌.

వాళ్ల అంచ‌నాల్ని కొన్ని స‌క్సెస్ ఫుల్ చిత్రాలు నిరూపించాయి. `యానిమ‌ల్` లో హింస‌తో పాటు శృంగారం హ‌ద్దు దాటటంతో `ఏ` వ‌చ్చింది. సందీప్ వంగా సినిమాలంటే ఆ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌ని స‌రి అని జ‌నాల్లోకి బ‌లంగా ఎప్పుడో వెళ్లిపోయింది. సందీప్ బ్రాండ్- ఏ స‌ర్టిఫికెట్ అనే ఇమేజ్ తోనే ఆ సినిమా వంద‌ల కోట్లు తెచ్చింది. ఇక `స‌లార్` కి హింస కార‌ణంగా `ఏ` వ‌చ్చింది. ఆ సినిమా కూడా వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించింది. అంత‌కు ముందు `బేబి` సినిమాలో శృంగార స‌న్నివేశాల కార‌ణంగా ఏ వ‌చ్చింది. ఆ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా నిలిచింది.

అలాగే `మ్యాడ్` సినిమా కూడా `ఏ` స‌ర్టిఫికెట్ తోనే మంచి విజ‌యం సాధించింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `గామీ` కూడా ఏ స‌ర్టిఫికెట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకొ చ్చింది. ఇందులో ఏ స‌న్నివేశాలు ఎక్క‌డా ఉండ‌వు. దీంతో ఈసినిమాకి ఏ స‌ర్టిఫికెట్ దేనికి అన్న సందేహం రాక‌మాన‌దు. కానీ అదే స‌ర్టిఫికెట్ తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. గోపీచంద్ `భీమా` లో కాస్త హింస ఉండ‌టంతో `ఏ` వ‌చ్చింది. అయినా ప‌ర్వా లేద‌ని లైట్ తీసుకుని వ‌చ్చేసారు. అయితే సెన్సార్ విచ్చ‌ల‌విడిగా అన్ని వేళ‌లా `ఏ` జారీ చేయ‌డం కూడా మంచిది కాద‌నే విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.