వార్ స్టోరీలతోనే రప్ఫాడించేస్తున్నారు!
పిప్పా నవంబర్ 10 అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. ఇక విక్కీ కౌశల్ అంటే దేశ భక్తి నేపథ్యంలో గలసినిమాలకు ఓ బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Nov 2023 6:17 AM GMTదేశ భక్తి నేపథ్యం గల కథలు బలంగా చెప్పడం బాలీవుడ్ కే చెల్లింది. ఆర్మెడ్ ఫోర్స్ బేసిస్ లో సినిమాలు చేయడంలో అందవేసిన చేయి వాళ్లది. ఆ నేపథ్యం గల స్టోరీల్ని ఎంతో బలంగా...ప్రభావంతంగా చెప్పగల దర్శకులు అక్కడే ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాటి కి మంచి సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. కొంత మంది మేకర్స్ ఆ జానర్ చిత్రాల్ని కూడా తెలివిగా కమర్శిలైజ్ చేయగల్గతున్నారు.
కోట్ల రూపాయలు వసూళ్లు తేగలుగుతున్నారు. అందుకే ఈ జానర్లో బాలీవుడ్ ఎన్ని సినిమాలు చేసినా ఇంకా చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఇండియా-పాకిస్తాన్ వార్ ని హైలైట్ చేస్తూ మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే 'పిప్పా'...' శామ్ బహదూర్'. ఇటీవలే రిలీజ్ అయిన పిప్పా ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇషాన్ కట్టర్..మృణాల్ ఠాకూర్ జంటగా 'ఎయిర్ లిఫ్ట్' ఫేం రాజా కృష్ణ మీనన్ తెరకెక్కిస్తున్నారు.
ట్రైలర్ తోనే సినిమాకి ఓ ఊపు తీసుకొచ్చారు. రియల్ ఆర్మీని తలపించేలా ట్రైలర్ లోనే బోలెండ క్యూరియాసిటీ తేగలిగారు. 1971 ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో దీన్ని తెరకెక్కించారు. సరిగ్గా ఇదే పాటయింట్ తో 'ఐబీ 71' అనే చిత్రాన్ని సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. పాకిస్తాన్ ఎటాక్ నుంచి బంగ్లాదేశ్ ని ఇండియా ఎలా కాపాడింది అన్న పాయింట్ తో తెరకెక్కించారు. పిప్పా కూడా అదే జానర్లో కొత్త కథాంశంతో చూపించబోతున్నారు.
అంతకు ముందు సంకల్ప్ 'ఘాజీ' చిత్రాన్ని సబ్ మెరైన్ వార్ బ్యాక్ డ్రాప్ లోచూపించాడు. దానికి జాతీయ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. పిప్పా నవంబర్ 10 అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. ఇక విక్కీ కౌశల్ అంటే దేశ భక్తి నేపథ్యంలో గలసినిమాలకు ఓ బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. 'ఉరి' సినిమాతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు.
ఆ తర్వాత అదే తరహా ప్రయత్నాలు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా శామ్ బహదూర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఇండియా-పాకిస్తాన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.