'OG' ఒరిజినల్ టైటిల్.. ఇదిగో క్లారిటీ
ఇక ఇది తెలుసుకుంటున్న అభిమానులు 'దే కాల్ హిమ్ ఓజీ' హ్యాష్ ను తెగ ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 4 Aug 2023 6:15 AM GMTరీసెంట్ గా 'బ్రో' సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాల షూటింగ్ ను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లు మళ్లీ మొదలు కానున్నాయని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకముందులానే సినిమా పాలిటిక్స్.. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లేలా పవన్ షెడ్యూల్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా 'ఓజీ' సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. చాలా రోజుల నుంచి ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఓ అభిమాని సోషల్ మీడియాలో 'భయ్యా టైటిల్ ఇదే ఉంచండి.. ఒకవేళ మార్చాలని ఆలోచన ఉంటే మార్చకండి' అంటూ ట్వీట్ చేశాడు.
అయితే అభిమాని చేసిన సూచనలపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్ స్పందించింది. 'ఏం లేదు ఇదే. దే కాల్ హిమ్ ఓజీ' అని బదులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమాకు 'ఒరిజినల్ గ్యాంగ్ స్టార్.. దే కాల్ హిమ్ ఓజీ' అనే టైటిలే ఖరారు అయినట్లు అర్థమైంది. ఇక ఇది తెలుసుకుంటున్న అభిమానులు 'దే కాల్ హిమ్ ఓజీ' హ్యాష్ ను తెగ ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సినిమా.. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే మూవీపై అటు అభిమానుల్లో, ఇటు సినీ ప్రియుల్లో భారీ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. 'సాహో' లాంటి హై యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకుని మరీ బలమైన కథ రాసుకున్నాడు సుజీత్. దానిని 'ఓజీ' పేరుతో సెట్స్ మీదకు తీసుకొచ్చారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ నెటిజన్లను, అభిమానులను బాగా ఆకట్టుకుంది. కొన్ని షెడ్యూల్స్ కూడా చిత్రీకరణ పూర్తైంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఇది. దాదాపు రూ. 500కోట్ల బడ్జెట్ అని కూడా వినికిడి ఉంది. ఈ చిత్రం కోసం పవన్ రూ. 75 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని ఆ మధ్య ప్రచారం సాగింది. అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకుంటారని అప్పట్లో కథనాలు వచ్చాయి.