Begin typing your search above and press return to search.

ఈవారం కంటెంట్ ఉన్న సినిమాలు.. ఏది మెరుస్తుందో?

డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ఇంటరెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:54 AM GMT
ఈవారం కంటెంట్ ఉన్న సినిమాలు.. ఏది మెరుస్తుందో?
X

డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ఇంటరెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అన్ని కూడా డిసెంట్ బజ్ తోనే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వీటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉండగా మరో రెండు డబ్బింగ్ సినిమాలు కావడం విశేషం. అల్లరి నరేష్ హీరో సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బచ్చలమల్లి’ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సుబ్బు తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి. అలాగే ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సారంగపాణి జాతకం’ కూడా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతోంది. రూప కొడవయూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. చేతిలో రాతల్ని, జాతకాలని నమ్మే యువకుడిగా ఈ చిత్రంలో ప్రియదర్శి కనిపించబోతున్నాడు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. దీనిపై ప్రియదర్శి చాలా హోప్స్ పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్ ల తర్వాత ఇంద్రగంటి తనకి అలవాటైన కామెడీ జోనర్ లో ఈ మూవీ చేశారు. ఇక ఉపేంద్ర హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ కూడా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఉపేంద్ర సినిమాలు అంటేనే చాలా యూనిక్ ఐడియాస్ తో ఉంటాయి. గతంలో అతను ‘A’ అనే మూవీ చేశారు. దానికి సీక్వెల్ గానే ఈ ‘UI’ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా విభిన్న కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. దీనిపైనా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలాగే తమిళం నుంచి వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా తెరకెక్కిన ‘విడుదల 2’ క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రాబోతోంది. ‘విడుదల’ మూవీకి కొనసాగింపుగా ఈ ‘విడుదల 2’ వస్తోంది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో దీనిపై నమ్మకాలు ఉన్నాయి. వెట్రిమారన్ కథలు అంటేనే అణచివేత, బలహీన వర్గాలు, పోరాటాల నేపథ్యంలో ఉంటాయి.

ఈ సినిమా కథాంశం కూడా అలాగే పోలీసులు, బలహీన వర్గాల తరపున పోరాడే నక్సల్స్ మధ్యలో పోరుగా ఉండబోతోంది. ఇలా నాలుగు భిన్నమైన జోనర్ సినిమాలు డిసెంబర్ 20న థియేటర్స్ లోకి వస్తున్నాయి. వీటిలో ఎన్ని కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలు విడుదల సమయానికి పుష్ప 2 హంగామా కూడా తగ్గుతుంది. దీంతో ఆడియన్స్ కచ్చితంగా తమ సినిమాలని ఆదరిస్తారని ఎవరికి వారు అనుకుంటున్నారు.