Begin typing your search above and press return to search.

సంక్రాంతిలో ఈ హీరోధే పర్ఫెక్ట్ ప్లాన్

90 రోజుల కన్నా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేయడంలో ఫుల్ సపోర్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 12:30 AM GMT
సంక్రాంతిలో ఈ హీరోధే పర్ఫెక్ట్ ప్లాన్
X

నా సామిరంగ.. కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ. సంక్రాంతి బరిలో దిగేందుకు ఫుల్ స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. థియేటర్లు దొరక్క ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిపోద్దని వార్తలొచ్చినా.. నాగ్ మాత్రం తన చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేస్తానని పట్టుబట్టారు. అనుకున్నట్లే జనవరి 14వ తేదీ భోగీ పండుగ రోజు రిలీజ్ చేశారు.

అయితే నాగార్జున ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. 90 రోజుల కన్నా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేయడంలో ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ మూవీ థియేట్రికల్ హక్కుల విషయంలో పెద్ద స్టెప్టే వేశారు. తన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. తమ సంస్థకు ఉన్న నెట్ వర్క్ ద్వారా భారీ స్థాయిలో థియేటర్లను దక్కించుకుని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ హక్కుల అమ్మకం విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ అయ్యి పెద్ద డీలే కుదర్చారు.

మొత్తానికి నా సామి రంగ సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అలా అన్నింట్లోనూ నాగార్జునే కీ రోల్ ప్లే చేశారు. అయితే సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజుతో పెద్ద పండుగకు వచ్చి నాగార్జున హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న నాగ్ ప్లాన్ సక్సెస్ అయిందని సినీ పండితులు చెబుతున్నారు.

తొలి రోజు కన్నా రెండో రోజు రూ.20లక్షలకుపైగా ఎక్కువ వసూళ్లు సాధించిందీ చిత్రం. వసూళ్లు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. సంక్రాంతికి పెర్ఫెక్ట్ మూవీ నా సామి రంగ అని సినీ ప్రియులు భావిస్తున్నారని.. ఫ్యామిలీలతో థియేటర్లకు వెళ్తున్నారని అంటున్నారు.

మ‌ల‌యాళంలో సూపర్ హిట్ అయిన పురింజు మ‌రియం జోస్ రీమేక్‌ గా నా సామిరంగ మూవీ తెర‌కెక్కింది తొలి రోజు రూ.4.33 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు రూ.4.55 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌ గా ఈ మూవీ రూ.17.8 కోట్ల గ్రాస్ క‌లెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు క‌లిపి రూ.8.88 కోట్ షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు యంగ్ హీరోలు అల్ల‌రి న‌రేశ్, రాజ్‌ త‌రుణ్ లీడ్ రోల్స్ లో న‌టించారు. భామలు ఆషికా రంగ‌నాథ్, రుక్స‌ర్ థిల్లాన్‌, మిర్నా మీన‌న్ హీరోయిన్లుగా క‌నిపించారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్నీ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి నాగార్జున.. బంగార్రాజు సీక్వెల్ తో వస్తారని టాక్ వినిపిస్తోంది.