Begin typing your search above and press return to search.

కల్కి.. ఇది ఫ్యాన్స్ కోసం..

దీపికా పదుకునే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాగా దిశా పటాని ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:32 AM GMT
కల్కి.. ఇది ఫ్యాన్స్ కోసం..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు రానటువంటి విధంగా సరికొత్త ప్రపంచాన్ని కల్కి కోసం నాగ్ అశ్విన్ సృష్టించాడు. అలాగే సినిమాలోని పాత్రలు అన్ని ఇండియన్ మైథాలజీ ఇనిస్పిరేషన్ తో తీసుకున్నారు.

భాగవతంలో చెప్పబడిన శ్రీమహావిష్ణువు చివరి అవతారం కల్కి నిజంగా పుడితే ఎలా ఉంటుంది అనే కోణం నుంచి ఈ సినిమా కథని చెబుతున్నాడు. కల్కి పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో సూపర్ హీరోగా నటిస్తున్నాడు. లార్డ్ పరశురామ్ పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నాడు. కమల్ హాసన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

దీపికా పదుకునే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాగా దిశా పటాని ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక ఇంటరెస్టింగ్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి విషెస్ తెలియజేసింది. కల్కి ఫస్ట్ లుక్ కోసం సినిమా ఆరంభంలో అనుకున్న పోస్టర్ ని దసరా ట్రీట్ గా అందించింది.

ఈ పోస్టర్ లో ప్రభాస్ షాడో ఉండగా అందులో ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేసే విధంగా విజువలైజేషన్ ఉంది. చూడటానికి చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోన్న ఈ పోస్టర్ మూవీ కాన్సెప్ట్ ని కూడా ప్రెజెంట్ చేస్తూ ఉండటం విశేషం. అయితే పోస్టర్ పై ఫ్యాన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. డార్లింగ్ బర్త్ డే అయిపోయిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేయడం ఏంటి అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

బియాండ్ లైన్ లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరు పెట్టనంత అత్యధిక బడ్జెట్ తో కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రానున్నారు. అయితే అది ఎప్పుడనేది క్లారిటీ లేదు.