ఇండస్ట్రీపై కోవిడ్ దెబ్బ ఇలా పడింది
భారతీయ చలన చిత్ర పరిశ్రమపై కరోనా ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 15 Aug 2023 4:56 AM GMTభారతీయ చలన చిత్ర పరిశ్రమపై కరోనా ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా ధృవీకరించింది. 2020-21 లో సినిమాల నిర్మాణంపై దారుణమైన దెబ్బ పడిందని కేంద్ర సమాచారా శాఖ..మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఒక నివేదికలో పేర్కొంది. 2018-19 లో కేంద్ర సెన్సార్ బోర్డు ఫీచర్ ఫిల్మ్స్..లఘు చిత్రాలు.. డాక్యుమెంటరీలు.. విదేశీ చిత్రాలన్నింటికీ 22,570 చిత్రాల ప్రదర్శనకు అనుమతిస్తే..2020-21 లో అది కేవలం 829 సంఖ్యకు పడిపోయింది.
2019-20 లో 20,539, 2021-22 లో 12,719, 2022-23 లో 18,070 చిత్రాలకు సెన్సార్ బోర్డ్ ధృవీకరణ పత్రాలు అందజేసింది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం.. సినీ రంగానికి చెందిన అన్ని విభాగాలు భయం కారణంగా చిత్రీకరణలు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో పూర్వపు వాతావరణం నెలకొంటుందని తెలిజయేసింది.
2022-23 లో కేంద్ర సెన్సార్ బోర్డు 1056 చిత్రాలకు మార్పులు సూచించడం లేదా పాకిక్షకంగా కట్స్ చెప్పడం జరిగిందని నివేదిక పేర్కొంది. లాక్ డౌన్ ప్రకటనతో ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిచిపో యాయి. అలా నిలిచిపోయిన వాటిలో కొన్ని కోవిడ్ అనంతరం తిరిగి ప్రారంభం కాగా..మరికొన్ని అలాగే నిలిచిపోయాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన డబ్బులు వృద్ధా ప్రయత్నంగా మిగిలిపోయింది.
దీంతో నిర్మాతలు సినిమాలపై ఆనాసక్తి చూపించారు. ఒకప్పుడు చిన్న సినిమాలు అధికంగా నిర్మాణం జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితి పెద్దగా కనిపించలేదు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో నిర్మాణం మెల్లగా పుంజుకుంటుంది. వైవిథ్యమైన కంటెంట్ తో నవతరం నిర్మాతలు సక్సెస్ అవుతోన్న వైనం ఆకర్షిస్తుంది.