రష్మిక సూపర్ వర్కౌట్ ఇది!
రష్మికపై ఎన్నో నెగిటివ్ కథనాలు వైరల్ అయినా ఏనాడు బాధపడని నటి తొలిసారి డీప్ ఫేక్ వీడియోపై తన బాధని వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 9 Nov 2023 11:56 AM GMTనేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట ఎంత సంచలనమైందో తెలిసిందే. రష్మికపై ఎన్నో నెగిటివ్ కథనాలు వైరల్ అయినా ఏనాడు బాధపడని నటి తొలిసారి డీప్ ఫేక్ వీడియోపై తన బాధని వ్యక్తం చేసింది. దీంతో ఆమె వ్యక్తిగతంగా ఎంతగా బాధపడిందో తేటతెల్లమైంది. ఈ విషయంలో రష్మికకి టాలీవుడ్ అంతా అండగా నిలబడిన సంగతి తెలిసిందే. ఇలాంటి డీప్ పేక్ వీడియోలు మరో నటిపై రాకుండా ఉద్యమించాలి అన్న రేంజ్ లో కదం తొక్కారు.
ఇంకా బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబచ్చన్ కూడా మద్దతుగా నిలిచారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం వంటివి జరిగాయి. అయినా ఈ వీడియో ఇంకా ఇంటర్నెట్ లో ఏదో మూల చక్కెర్లు కొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియో ఒకటి ఆమె స్వయంగా షేర్ చేసింది. అందులో రష్మిక ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్లు చేస్తుంది. నేల మీద పడి పల్టీలు కొడుతుంది.
తల భాగం నుంచి కాళ్ల వరకూ ప్రతీ భాగాన్ని అటు ఇటు కదిపేస్తూ చేస్తోన్న వీడియో ఇది. ఇందులో అమ్మడు టైట్ ఫిట్ జిమ్ దుస్తుల్లో కనిపిస్తుంది. తొడలు పట్టేసిన నలుపు రంగు స్టెచ్ ప్యాంట్.. టాప్ లో స్కిన్ టైట్ ధరించింది. వర్కౌట్ అనంతరం శరీరానికి అవసరమైన పోషకాలు అన్నింటిని పౌడర్ రూపంలో వాటర్ లో మిక్స్ చేసి తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈవీడియో తో రష్మిక తన బలాన్ని చాటినట్లు అయింది. తన పై వచ్చిన డీప్ ఫేక్ పై బాధపడిన మాట వాస్తవం. కానీ ఆ బాధని ఇంకా అలాగే తలుచుకుంటూ కూర్చోలేదు. నా పనిలో నేను బిజీ అయ్యాను..మీ పనిలో మీరు బిజీ అవ్వండని సంకేతాలు పాస్ చేసినట్లు అయింది. అంతేగా రష్మికపై వచ్చిందో పేక్ వీడియో. హీరోయిన్లపై ఇలాంటి మార్పింగ్ వీడియోలు గతంలోనూ తెరపైకి వచ్చాయి. కాకపోతే టెక్నాలజీ వేరైంది అంతే.