Begin typing your search above and press return to search.

బంగారం స్మ‌గ్ల‌ర్ల‌కు చిక్కిన సీనియ‌ర్ న‌టుడు!

ర‌జ‌నీ త‌దుప‌రి కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి పని చేస్తారు.

By:  Tupaki Desk   |   27 May 2024 11:30 AM GMT
బంగారం స్మ‌గ్ల‌ర్ల‌కు చిక్కిన సీనియ‌ర్ న‌టుడు!
X

రజనీకాంత్ ప్రస్తుతం ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న 'వేట్టయాన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇంత‌లోనే త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన ప్లానింగ్ సాగుతోంది. ర‌జ‌నీ త‌దుప‌రి కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి పని చేస్తారు. ఈ చిత్రానికి 'కూలీ' అనే టైటిల్‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

క‌న‌గ‌రాజ్ త‌న గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈసారి కూడా ఒక వినూత్న‌మైన క‌థాంశాన్ని ఎంపిక చేసుకుని అద్భుత‌మైన స్క్రీన్ ప్లేను రెడీ చేసార‌ని తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే క‌థాంశ‌మిది. భారీ యాక్ష‌న్ థ్రిల్స్ కి ఆస్కారం ఉన్న క‌థ‌లో ఊహించ‌ని మ‌లుపుల‌తో స్క్రీన్ ప్లే ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలిసింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. స‌త్య‌రాజ్ దాదాపు 37 సంవత్సరాల విరామం తర్వాత రజనీకాంత్‌తో మళ్లీ కలిసి ప‌ని చేస్తున్నారు. 1987లో విడుదలైన మనతిల్ ఉరుధి కోసం చివరిసారిగా కలిసి పనిచేశారు. ఇంత‌కాలానికి మ‌ళ్లీ ఈ క‌ల‌యిక సాధ్య‌ప‌డుతోంది. బాహుబలి క‌ట్ట‌ప్ప‌గా స‌త్య‌రాజ్ ఇమేజ్ ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో సత్యరాజ్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించనున్నారు.

లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇంత‌కుముందు ఖైదీ, విక్ర‌మ్ లాంటి వైవిధ్య‌మైన యాక్ష‌న్ చిత్రాల‌ను అసాధార‌ణ‌ స్క్రీన్ ప్లేతో అందించారు. అదే తీరుగా ఈసారి ర‌జ‌నీ సినిమాని డిఫ‌రెంట్ కాన్సెప్టుతో ర‌క్తి క‌ట్టించ‌నున్నార‌ని తెలిసింది. బంగారం స్మ‌గ్లింగ్, మాఫియా నేప‌థ్యంలో క‌థాంశం కాబ‌ట్టి యాక్ష‌న్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని కూడా తెలిసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.