Begin typing your search above and press return to search.

ఈసారి సంక్రాంతి మొనగాడు.. సరిలేరు నీకెవ్వరు

నిజానికి సంక్రాంతి రేసులో ఎక్కువగా పెద్ద హీరోలు పోటీ పడుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:42 AM GMT
ఈసారి సంక్రాంతి మొనగాడు.. సరిలేరు నీకెవ్వరు
X

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉన్న మూవీ మాత్రం గుంటూరుకారం అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిజానికి సంక్రాంతి రేసులో ఎక్కువగా పెద్ద హీరోలు పోటీ పడుతూ ఉంటారు. 2021లో సరిలేరు నీకెవ్వరూ, ఆల వైకుంఠపురంలో సినిమాలతో మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ పడ్డారు. రెండు మాస్ చిత్రాలుగానే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రెండు సమ ఉజ్జీలు లాంటి మూవీస్ ఉన్నప్పుడు కాంపిటేషన్ గట్టిగా ఉంటుంది. అలాగే ప్రేక్షకాదరణ కూడా రెండు సినిమాలకి దొరుకుతుంది.

గత ఏడాది చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి వచ్చిన సంక్రాంతి రేసులో ధైర్యంగా రిలీజ్ చేశారు. రెండింటికి ఆదరణ రావడంతో పాటు నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టాయి. చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలే ఎక్కువగా సంక్రాంతి రేసులో పోటీ పడ్డాయి.

అయితే ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మాత్రమే పెద్ద హీరో సినిమాగా వస్తోంది దీనికి పోటీగా మూడు సినిమాలు ఉన్నా కూడా అవి గుంటూరు కారంకి పోటీ ఇచ్చే రేంజ్ లో లేవు. బడ్జెట్ పరంగా చూసుకుంటే గుంటూరు కారం తర్వాత హనుమాన్ కాస్తా పెద్ద సినిమా. క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే విక్టరీ వెంకటేష్, కింగ్ నాగ్ సినిమాలు పెద్ద మూవీస్ గా ఉన్నాయి.

మార్కెట్ రేషియో ప్రకారం చూసుకుంటే గుంటూరు కారం దగ్గర్లో కూడా మిగిలిన సినిమాలు లేవు. అందుకే ఈ సంక్రాంతి ఎక్కువ ఫెచ్చింగ్ గుంటూరు కారం సినిమాకి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏ సినిమా అయిన ఓపెనింగ్స్ వరకు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి స్టార్ క్యాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. తరువాత కథలో విషయం ఉందనుకుంటేనే లాంగ్ రన్ లో కొనసాగే ఛాన్స్ ఉంటుంది.