Begin typing your search above and press return to search.

ఈసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ ఫిక్స్.!

ఈమధ్యనే అయలాన్ అంటూ మరో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 3:30 AM GMT
ఈసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ ఫిక్స్.!
X

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన శివ కార్తికేయన్ తన వెరైటీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అక్కడ దళపతి విజయ్ తర్వాత ప్రతి సినిమాకు రెవిన్యూ విషయంలో నిర్మాతలను లాస్ చేయకుండా సేఫ్ చేస్తూ వస్తున్నాడు శివ కార్తికేయన్. ఈమధ్యనే అయలాన్ అంటూ మరో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఎస్.కె 21 సినిమా సెట్స్ మీద ఉంది.

రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అయలాన్ 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ సినిమాకు కూడా శివ కార్తికేయన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండిటితో పాటుగా శివ కార్తికేయన్ 23వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

శివ కార్తికేయన్ మురుగదాస్ ఈ కాంబో సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అది నిజం అవ్వలేదు. ఐతే ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ లో సినిమా ఓకే అయ్యిందని తెలుస్తుంది. మురుగదాస్ డైరెక్షన్ లో శివ కార్తికేయన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కనున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుందట. ఈ సినిమా కథను మురుగదాస్ ముగ్గురు రైటర్స్ తో కలిసి సిద్ధం చేశారట.

కొన్నాళ్లుగా మురుగదాస్ కెరీర్ పరంగా అంతగా ఫాం లో లేరు. ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసి నేషనల్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్ ఇప్పుడు పూర్తిగా వెనకపడ్డారు. అయితే శివ కార్తికేయన్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. శివ కార్తికేయన్ వరుసగా 3 ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. మురుగదాస్ సినిమా మాత్రం వేరేల్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది.

శివ కార్తికేయన్ సినిమా అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరించే సినిమాలు చేస్తుంటాడు. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం మురుగదాస్ తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. క్రైం థ్రిల్లర్ జోనర్ అంటే శివ కార్తికేయన్ కు కొత్త జోనర్ అన్నట్టే లెక్క. మరి ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. మురుగదాస్ మాత్రం ఈ సినిమా టార్గెట్ మిస్ అవ్వకూడదని గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.