ఈ వారం సినిమాలు.. ఏది మెరుస్తుందో..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ నెల పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేదు
By: Tupaki Desk | 26 April 2024 5:23 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ నెల పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేదు. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యింది. మంచి పాజిటివ్ బజ్ తో మూవీ థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అయితే మొదటి రోజు మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
తరువాత పెద్దగా పుంజుకోలేదు. ఏప్రిల్ 11న డబ్బింగ్ మూవీ డియర్, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకి పర్వాలేదనే టాక్ వచ్చిన లాంగ్ రన్ లో నిలబడలేదు. అలాగే విజయ్ ఆంటోనీ లవ్ గురు, సుహాస్ శ్రీరంగ నీతులు, ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ వారం నాలుగు సినిమాల వరకు థియేటర్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వాటిలో కొద్దిగా హైప్ ఉన్న మూవీ అంటే విశాల్ రత్నం ఒక్కటే. తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. దీనికి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 36 నిముషాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే అందరూ కొత్తవాళ్లు చేసిన కొంచెం హటకే అనే మూవీ కూడా రిలీజ్ అవుతోంది. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే రుద్రాక్షపురం 3KM అనే మూవీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా నిడివి 1:56 గంటల నిడివి ఉండగా యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ వారు ఇచ్చారు.
మల్లెమొగ్గ అనే క్యూట్ లవ్ స్టోరీ మూవీ కూడా ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివి ఉండగా, యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ సభ్యులు ఇచ్చారు. ఈ సినిమాలలో రత్నం మూవీకి మాత్రమే చెప్పుకోదగ్గ ఆదరణ ఉండే అవకాశం ఉంది. సూర్య సింగం సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో రత్నం మూవీ తెరకెక్కింది. అలాగే రాయలసీమ, తమిళనాడు సరిహద్దులో జరిగే కథగా ఈ మూవీ ఉండబోతోంది. దీంతో కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ ఉంది.