Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ కాంటెంట్.. టాప్ లిస్ట్ ఇదే!

ఈ వారం ఏ ఛానల్ లో ఏవి రిలీజ్ అయ్యాయనేది చూసుకుంటే ఆహా విజయ్ ఆంటోనీ రోమియో తమిళ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 4:26 AM GMT
ఈ వారం ఓటీటీ కాంటెంట్.. టాప్ లిస్ట్ ఇదే!
X

ఓటీటీలో వీకెండ్ సందడి మళ్ళీ షురూ అయ్యింది. తెలుగుతో హిందీ, ఇంగ్లీష్ భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్పేస్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటిలో అన్ని జోనర్స్ లకి సంబందించిన కంటెంట్ ఉండటం విశేషం. ముఖ్యంగా ఓటీటీ ఆడియన్స్ క్రైమ్, థ్రిల్లర్, హర్రర్, సస్పెన్స్ జోనర్ లలో కథలని చూడటానికి ఇష్టపడతారు. డిజిటల్ ఛానల్స్ కూడా అలాంటి ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్న కంటెంట్ లకి పెద్దపీట వేస్తుంది.

ఈ వారం ఏ ఛానల్ లో ఏవి రిలీజ్ అయ్యాయనేది చూసుకుంటే ఆహా విజయ్ ఆంటోనీ రోమియో తమిళ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అంజలి లీడ్ రోల్ లో నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ సందడి చేస్తోంది. కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించాడు. థియేటర్ లో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. జీ5లో 8AM మెట్రో అనే హిందీ మూవీ రిలీజ్ అయ్యింది. లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో మల్లేశం మూవీ చేసిన రాజ్ రాచకొండ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

డీసెంట్ మూవీగా హిందీ ఆడియన్స్ ని ఈ చిత్రం ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన మలయాళీ సూపర్ హిట్ మూవీ ఆవేశం స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ది గోట్ రిలీజ్ అయ్యింది. సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా హిందీలో తెరకెక్కిన యోధ మూవీ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ హాలీవుడ్ మూవీ ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ ప్రసారంలో ఉంది. సోనీ లివ్ అన్ దేఖీ 3 హిందీ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

లయన్స్ గేట్ ప్లేలో హాలీవుడ్ మూవీ ది మార్ష్ కింగ్స్ డాటర్ స్ట్రీమింగ్ అవుతుంది నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ బోడ్కిన్ రిలీజ్ అయ్యింది. అలాగే హాలీవుడ్ మూవీ మదర్ ఆఫ్ ది బ్రెడ్ ప్రేక్షకులని అలరిస్తోంది. థాంక్యూ నెక్ట్స్ వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఆపిల్ టీవీ ప్లస్ డార్క్ మేటర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ కాన్ క్వీన్ వెబ్ సిరీస్, మాక్స్ టన్ హాల్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లివే

ఆహా :

రోమియో (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

గీతాంజలి మళ్ళీ వచ్చింది: స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

8 ఎ ఎం. మెట్రో (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

ఆవేశం (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

ది గోట్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

యోధ (హిందీ) (Yodha) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ+హాట్ స్టార్ :

ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

అన్ దేఖీ 3 (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

ది మార్ష్ కింగ్స్ డాటర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

బోడ్కిన్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

మదర్ ఆఫ్ ది బ్రెడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

థాంక్యూ నెక్ట్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

డార్క్ మేటర్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

హాలీవుడ్ కాన్ క్వీన్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

మాక్స్ టన్ హాల్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది