ఈ వారం థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే మే 17న గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజుయాదవ్ మూవీ రిలీజ్ అవుతోంది.
By: Tupaki Desk | 14 May 2024 7:07 AM GMTతెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా కాలక్షేపం కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వారం కూడా అన్ని భాషల నుంచి వెబ్ సిరీస్ లు వివిధ భాషలలో ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. అలాగే కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే మే 17న గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజుయాదవ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీపైన పాజిటివ్ బజ్ నడుస్తోంది. నర్రా శివనాగు దర్శకత్వంలో తెరకెక్కిన నటరత్నాలు అనే మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే దర్శిని, అక్కడివారు ఇక్కడున్నారు అనే చిన్న సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నాయి.
చియాన్ విక్రమ్ అపరిచితుడు మూవీని మే 17న థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రాలలో ఏది ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే ఆహా ఓటీటీలో విద్యావాసుల అహం అనే మూవీ స్ట్రైట్ గా రిలీజ్ అవుతోంది. శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అలాగే డిస్నీ హాట్ స్టార్ లో మే 14న తెలుగు డబ్బింగ్ మూవీ చోరుడు రిలీజ్ అవుతోంది. అలాగే మే 17న హిందీ యానిమేటెడ్ వెబ్ సిరీస్ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. జీ4 ఓటీటీలో ఆదాశర్మ లీడ్ రోల్ లో నటించిన బస్తర్ మూవీ 13న రిలీజ్ అయ్యింది. బుక్ మై షో ఓటీటీలో మే 13న గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ అందుబాటులోకి వచ్చింది.
ఇవి కాకుండా ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా ఉన్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 13
చోరుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 14
అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 15
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 17
నెట్‌ఫ్లిక్స్
ఆష్లే మ్యాడిసన్: సెక్స్ లైస్ అండ్ స్కాండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15
బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15
బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 16
మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 16
పవర్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17
ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్)- మే 17
థెల్మాద యూనికార్న్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17
అమెజాన్ ప్రైమ్
ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 16
99 ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- మే 17
జీ5
బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ చిత్రం)- మే 17
తళమై సెయలగమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 17
జియో సినిమా
డిమోన్ స్లేయర్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 13
జర హట్కే జర బచ్కే (హిందీ చిత్రం)- మే 17
బుక్ మై షో
గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- మే 13
సోనీ లివ్
లంపన్ (మరాఠీ వెబ్ సిరీస్)- మే 16
ది బిగ్ సిగార్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 17
ఎల్లా (హిందీ మూవీ)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 17