Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లివే

ఆడియన్స్ కూడా నచ్చిన జోనర్ మూవీస్, వెబ్ సిరీస్ లు చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 10:03 AM GMT
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లివే
X

ఓటీటీ వీకెండ్ సందడి ఎప్పటిలాగే మళ్ళీ షురూ అవుతోంది. థియేటర్స్ లో ప్రతి శుక్రవారం వస్తే కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రతి వారం ఓటీటీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకి వస్తున్నాయి. ఓటీటీ ఛానల్స్ వచ్చిన తర్వాత భాషాపరిమితులు పూర్తిగా పోయాయి. అన్ని భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటున్నాయి.

ఆడియన్స్ కూడా నచ్చిన జోనర్ మూవీస్, వెబ్ సిరీస్ లు చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ భాషలో నచ్చిన జోనర్ కంటెంట్ ఉన్న వీక్షిస్తున్నారు. అలాగే ఛానల్స్ వారు కూడా కంటెంట్ ని ఒక్క భాషకి పరిమితం చేయకుండా మల్టీఫుల్ లాంగ్వేజ్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో కొత్తదనం ఉన్న కథలని చూసే అవకాశం పబ్లిక్ కి వస్తోంది. ఇదిలా ఈ వీకెండ్ రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే ఇలా ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు హీరోగా తెరకెక్కిన మహారాజ్ మూవీ కూడా అదే రోజు స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. హాట్ స్టార్ లో మంచు లక్ష్మి, వేదిక లీడ్ రోల్ లో నటించిన ఫిక్షనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యక్షిణి జూన్ 14న రిలీజ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు మూవీ గ్రౌండ్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

ఆహాలో చైతన్య రావ్, సునీల్ లాంటి లీడింగ్ యాక్టర్స్ నటించిన పారిజాత పర్వం జూన్ 12న స్ట్రీమింగ్ కాబోతోంది. జీ5లో నివేదా పేతురాజ్ లీడ్ రోల్ లో నటించిన పరువు వెబ్ సిరీస్ జూన్ 14న విడుదల అవుతోంది. వీటితో కలిపి 22 సినిమాలు, వెబ్ సిరీస్ ల వరకు జూన్ 11 నుంచి 14 వరకు ఓటీటీలోకి వస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్

టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) – జూన్ 11

కింగ్ ఆఫ్ కలెక్టబుక్టల్స్ ద గోల్డెన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 12

బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 13

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) – జూన్ 14

మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 14

హాట్ స్టార్

ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 10

ద కలర్ ఆఫ్ విక్టరీక్ట (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 10

నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

యక్షిణి ( వెబ్ సిరీస్ ) – జూన్ 14

జియో సినిమా:

ఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) – జూన్ 11

అమెజాన్ ప్రైమ్

గ్రౌండ్ (తెలుగు సినిమా) – జూన్ 10

ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 13

ఆహా

పారిజాత పర్వం (తెలుగు సినిమా) – జూన్ 12

కురంగు పెడల్ (తమిళ సిరీస్) – జూన్ 14

యాపిల్ టీవీ ప్లస్:

ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 14

జీ5

లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) – జూన్ 14

పరువు (తెలుగు సిరీస్) – జూన్ 14