Begin typing your search above and press return to search.

ఆ స్టార్‌ హీరో.. ఈ ఏడాది ఉన్నట్టా? లేనట్టా?

తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ ప్రస్తుతం 'తంగలాన్‌' సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 6:20 AM GMT
ఆ స్టార్‌ హీరో.. ఈ ఏడాది ఉన్నట్టా? లేనట్టా?
X

తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ ప్రస్తుతం 'తంగలాన్‌' సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. గతంలో పలు చిత్రాల్లో విక్రమ్‌ విభిన్నమైన పాత్రలు మరియు గెటప్స్ లో కనిపించాడు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా తంగలాన్ లో కనిపించబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో విడుదల అయిన తంగలాన్ పోస్టర్స్ విక్రమ్‌ ఫ్యాన్స్ కి హైప్ తీసుకు వచ్చాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను ఓ మంచి కంటెంట్‌ తో రూపొందించాడని తమిళ సినీ ప్రేక్షకులు చాలా బలంగా నమ్ముతున్నారు.

సినిమా మేకింగ్‌ కు ముందుగా అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువ సమయం పట్టడంతో పాటు, ఇతర విషయాల కారణంగా బడ్జెట్‌ విపరీతంగా పెరిగిందట. ముందుగా అనుకున్న బడ్జెట్‌ తో పోల్చితే దాదాపుగా 50% వరకు పెరిగిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

బడ్జెట్‌ విషయం పక్కన పెడితే విడుదల విషయంలో మేకర్స్ అసలు క్లారిటీ ఇవ్వడం లేదు. మొదట 2024 సంక్రాంతికి అంటూ ప్రచారం చేశారు. మేకింగ్‌ లో జాప్యం కారణంగా 2024 సమ్మర్‌ కి వాయిదా వేయడం జరిగింది. సమ్మర్‌ పూర్తి అయ్యింది, ఇప్పటి వరకు తంగలాన్ విడుదల అవ్వలేదు.

విక్రమ్‌ అభిమానులు ఇంకెప్పుడు తంగలాన్ సినిమా వస్తుంది అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఏడాది లో ఇక నుంచి విజయ్‌, రజినీకాంత్‌, అజిత్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ లతో పాటు పెద్ద హీరోల పాన్‌ ఇండియా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి.

కనుక ఈ ఏడాదిలో తంగలాన్ విడుదల సాధ్యమేనా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్‌ నుంచి ఇప్పటికి అయినా ఒక ప్రకటన వస్తే బాగుంటుందని విక్రమ్‌ అభిమానులు మరియు తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.