Begin typing your search above and press return to search.

2025: ఇంత మంచి సినిమాలు ఒకేసారి వస్తే ఎలా?

సంక్రాంతి తర్వాత బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంచి హిట్స్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. అలా నెక్స్ట్ ఇయర్ దసరాకు మూడు మూవీస్ రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2024 10:30 AM GMT
2025: ఇంత మంచి సినిమాలు ఒకేసారి వస్తే ఎలా?
X

వచ్చే ఏడాది సినీ దసరాకు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ అప్పుడే మేకర్స్ కర్చీఫులు వేసేస్తున్నారు. తమ సినిమాల విడుదల తేదీలను ఫిక్స్ చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంచి హిట్స్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. అలా నెక్స్ట్ ఇయర్ దసరాకు మూడు మూవీస్ రాబోతున్నాయి.

మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు మూవీతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. వీడియో గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో సాయి ధరమ్ తేజ్ మాస్ లుక్ లో కనిపిస్తూ అలరిస్తున్నారు.

ఫాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్నట్లు అర్థమవుతున్న ఆ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అయితే మొన్ననే నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25నే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సింహా, లెజెండ్ , అఖండ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ ప్రోమో వేరే లెవెల్ లో ఉంది. అయితే సంబరాల ఏటి గట్టు, అఖండ-2 చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఒకేరోజు సందడి చేయనున్నారు. కాగా.. కాంతార: ఛాప్టర్ 1 కూడా దసరా కానుకగానే బరిలోకి దిగనుంది. అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రీక్వెల్ ఎలా ఉంటుందోనని అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది దసరాకు ఇప్పటి వరకు మూడు సినిమాలు ఫిక్స్ అవ్వగా.. అందులో అఖండ-2 తాండవం, కాంతార ప్రీక్వెల్ దాదాపు గాడ్ కి సంబంధించిన జోనర్ లో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ మాత్రం ఏ జోనర్ లో రూపొందుతుందో ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. కనీసం క్లూ కూడా ఇవ్వలేదు. అయితే గ్లింప్స్ ను చూస్తుంటే.. సరికొత్త జోనర్ లో సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. దాదాపు మూడు సినిమాలు కూడా గూస్ బంప్స్ తెప్పించే అంశాలతో రానున్నట్లు అర్ధమవుతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇంతమంచి సినిమాలు ఒకేసారి వస్తే ఎలా అనే ప్రశ్న కూడా రాకుండా ఉండదు. మూడు కూడా మొదటి రోజే చూడాలని అనిపించే సినిమాలే. కాబట్టి రెండు ముందుగా వచ్చి ఒకటి వెనక్కి తగ్గితే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి వీటిలో ఏదైనా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.