Begin typing your search above and press return to search.

స్పె యూనివర్స్.. ముగ్గురు బడా హీరోలు

ఇప్పుడు ఆదిత్య చోప్రా నుంచి సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్ సిరీస్ లో మూడో భాగంగా టైగర్ 3 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 4:30 PM GMT
స్పె యూనివర్స్.. ముగ్గురు బడా హీరోలు
X

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ వస్తోన్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రాకి ఈ జోనర్ కథలు ఎక్కువ సక్సెస్ అందిస్తున్నాయి. దీంతో నెక్స్ట్ కూడా తన ప్రొడక్షన్ నుంచి అవే సినిమాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏక్ ది టైగర్ సినిమాతో స్పై జోనర్ మూవీస్ ని యష్ రాజ్ ఫిలిమ్స్ లో స్టార్ట్ చేశారు.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత టైగర్ జిందా హై సినిమా సీక్వెల్ గా వచ్చి సక్సెస్ అయ్యింది. ఈ రెండు సూపర్ హిట్ కావడంతో స్పై సిరీస్ ని కొనసాగిస్తూ షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా వెయ్యికోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

ఇప్పుడు ఆదిత్య చోప్రా నుంచి సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్ సిరీస్ లో మూడో భాగంగా టైగర్ 3 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పటికే స్పై యూనివర్స్ క్రియేట్ చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్ పఠాన్ సినిమాలో టైగర్ క్యారెక్టర్ ని లాస్ట్ లో రివీల్ చేయడం ద్వారా నెక్స్ట్ పఠాన్ వెర్సస్ టైగర్ మూవీ ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు.

అలాగే ఆదిత్య చోప్రా యష్ రాజ్ లో హృతిక్ రోషన్ హీరోగా వార్ మూవీని కూడా నిర్మించారు. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా వార్ 2 మూవీ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

అయితే టైగర్ 3లో షారుఖ్ క్యారెక్టర్ తో పాటు, హృతిక్ రోషన్ రోల్ కూడా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ లో ముగ్గురు రా ఏజెంట్ పాత్రలని కలపడం ద్వారా పఠాన్ యూనివర్స్ కి కొనసాగింపు చూపించబోతున్నారంట. అయితే వీరిని ఎలా కలుపుతారు. నెక్స్ట్ సినిమాకి ఎలా లీడ్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.