Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్‌.. అనుష్క సోద‌రుడితో యానిమ‌ల్ గ‌ర్ల్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కం నిర్మాత‌ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో త్రిప్తి డేటింగ్ లో ఉన్న‌ప్ప‌టి ఫోటోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:53 PM GMT
త్రోబ్యాక్‌.. అనుష్క సోద‌రుడితో యానిమ‌ల్ గ‌ర్ల్!
X

ఒకే ఒక్క ఛాన్స్ గేమ్ ఛేంజ‌ర్‌గా మారింది. ఒక్క‌ సినిమాతో ఓవ‌ర్ నైట్‌లో పెద్ద స్టార్‌గా ఎదిగింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అన్న పిలుపు అందుకుంటోంది. ప్ర‌స్తుతం నిర్మాత‌లు సూట్ కేసులు ప‌ట్టుకుని త‌న వెంట‌ప‌డేంత‌గా ద‌శ తిరిగింది. ఇంత‌కీ ఎవ‌రీ భామ అంటే.. పేరు త్రిప్తి దిమ్రీ. ఇటీవ‌ల కొద్దిరోజులుగా మీడియా హెడ్ లైన్స్ లో న‌లుగుతున్న పేరు ఇది. దీనికి కార‌ణం `యానిమ‌ల్` చిత్రంలో తన అద్భుత న‌ట‌న‌.. ప్ర‌తిభ‌. త్రిప్తి నటించిన‌ జోయా పాత్ర‌ను యూత్ పిచ్చిగా ప్రేమిస్తున్నారు. ఈ పాత్రతో ప్రేక్ష‌కుల‌ హృదయాలను గెలుచుకుంది. త్రిప్తి త‌న‌దైన అందం అద్భుత‌ నటనతో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇప్పుడు త్రిప్తి గురించి ఇరుగు పొరుగు భాష‌ల్లోను ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే త్రిప్తి ఇప్పుడు వ్య‌క్తిగ‌త జీవితం విష‌యంలో మీడియా హెడ్ లైన్స్‌లోకొచ్చింది.

అస‌లు ఎవ‌రు ఈ త్రిప్తి దిమ్రీ? అంటూ ఆరాలు తీస్తున్న‌వారికి త‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. నిజానికి హిందీ చిత్ర‌సీమ‌లో అందమైన తారలలో త్రిప్తి ఒకరు. కానీ యానిమ‌ల్ కి ముందు అంతగా పాపులారిటీ రాలేదు. ఇప్పుడు యానిమ‌ల్ తో క్రేజ్ స్కైని తాకింది. ఒకే ఒక్క ఛాన్స్ అంతా మార్చేసింది. అభిమానులు త‌న‌ను ర‌ష్మిక‌తో పాటుగా నేషనల్ క్రష్ అని పిలిచేంత‌గా పాపుల‌రైంది. ముఖ్యంగా యూత్‌ త్రిప్తిపై అపార‌మైన‌ ప్రేమను కురిపిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా త్రిప్తి దిమ్రీ ప్ర‌ముఖ హీరోయిన్ సోద‌రుడితో ప్రేమాయ‌ణంలో ఉన్నప్ప‌టి త్రోబ్యాక్ (పాత‌) ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కం నిర్మాత‌ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో త్రిప్తి డేటింగ్ లో ఉన్న‌ప్ప‌టి ఫోటోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. అయితే ఈ జంట డేటింగ్ ముగిసి బ్రేక‌ప్ కూడా అయింద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి. కానీ త్రోబ్యాక్ ఫోటోలు ఇద్ద‌రూ జ‌త‌గా ఉన్నవి అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి

ప్ర‌భాస్ స‌ర‌స‌న స్పిరిట్‌లో?

యానిమ‌ల్ విజ‌యం అనంత‌రం త్రిప్తి దిమ్రీ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఆఫ‌ర్లు అందుకుంటోంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. సందీప్ వంగాతో త్రిప్తి దిమ్రీ తదుపరి చిత్రం `స్పిరిట్` అంటూ ప్ర‌చారం హోరెత్తుతోంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంది. అంతేకాదు అభిమానులు ప్రభాస్- రణబీర్ కాంబినేష‌న్‌లో క్రాస్ఓవర్ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని కూడా ఊహాగానాలు సాగిస్తున్నారు. యానిమ‌ల్ నుంచి ర‌ణ‌బీర్- త్రిప్తి ఇద్ద‌రినీ స్పిరిట్ లోకి దర్శ‌కుడు సందీప్ ప్ర‌వేశ‌పెట్ట‌వ‌చ్చ‌ని కొన్ని మీడియాల్లో క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనికి ఇంకా అధికారికంగా ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. యానిమల్‌లో రణబీర్ కపూర్‌తో కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో క‌నిపించిన త్రిప్తి కి స్క్రీన్ సమయం ఎక్కువ కానప్పటికీ మంచి గుర్తింపు ద‌క్కింది. త్రిప్తి ఇంతకుముందు మామ్, పోస్ట‌ర్ బోయ్స్, బుల్‌బుల్, క్వాలా వంటి చిత్రాలలో కూడా న‌టించింది.

స్పిరిట్ చిత్రంలో సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ స‌ర‌స‌న‌ త్రిప్తి డిమ్రీ కనిపించనుందని ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్ సైట్ లో క‌థ‌నం వెలువ‌రించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. చనిపోతున్న స్నేహితుడికి చేసిన వాగ్దానాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్రయత్నించే గ్యాంగ్ లీడర్‌కి సంబంధించిన క‌థ‌తో స్పిరిట్ తెర‌కెక్క‌నుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ఈ చిత్రం ప్రతీకార కథతో రూపొందనుంది. త్రిప్తి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ప్రచారం సాగుతోంది. త్రిప్తితో పాటు అనంత్ నాగ్, త్రిష కృష్ణన్ త‌దిత‌రులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. సెప్టెంబ‌ర్ 2024 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రం కోసం 400 కోట్ల బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కొంతకాలం క్రితం సందీప్ వంగా రెడ్డి ప్రభాస్ - రణబీర్ జోడీతో యానిమల్ విశ్వం కోసం కలిసి ప‌ని చేసే అవకాశం గురించి కూడా ప్రస్తావించారు. రెండు చిత్రాలలో త్రిప్తిని నటింపజేయడం ఒక మాస్టర్ ప్లాన్ అని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ పెండింగ్‌లో ఉంది.