Begin typing your search above and press return to search.

ప్రభాస్ vs యష్.. మధ్యలో మరో బిగ్ హీరో

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ 10 డేట్ కి మరో సినిమా కూడా పోటీలో వచ్చేలా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 9:12 AM GMT
ప్రభాస్ vs యష్.. మధ్యలో మరో బిగ్ హీరో
X

2025 ఏప్రిల్ 10 డేట్ కి ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ వాయిదా పడే అవకాశం లేదని చెప్పాలి. అలాగే రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా తెరకెక్కుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉంది. అందుకే అనుకున్న డేట్ కి రిలీజ్ కాకపోవచ్చని అనుకుంటున్నారు. ప్రభాస్, యష్ ఇద్దరికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ ఉంది. ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే రెండు సినిమాలు ఇంపాక్ట్ అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ 10 డేట్ కి మరో సినిమా కూడా పోటీలో వచ్చేలా కనిపిస్తోంది.

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే మూవీ తెరకెక్కుతోంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ మూవీ ఉండబోతోంది. కమల్, మణిరత్నం కలయికలో 37 ఏళ్ళ తర్వాత ఈ మూవీ వస్తోంది. వీరిద్దరూ చివరిగా 1987లో ‘నాయకన్’ సినిమా కోసం వర్క్ చేశారు. తరువాత మళ్ళీ కలిసి పనిచేయలేదు. ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తో మణిరత్నం మరల లైన్ లో పడ్డాడు.

ఈ మూవీని కమల్ హాసన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ‘నాయకన్’ రేంజ్ ఐకానిక్ ప్రాజెక్ట్ గా ‘థగ్ లైఫ్’ కూడా ఉంటుందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే ‘ది రాజాసాబ్’ మూవీకి పోటీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభాస్ తో పోల్చుకుంటే కమల్ హాసన్ కి తక్కువ పాన్ ఇండియా మార్కెట్ ఉంది. చివరిగా కమల్ హాసన్ నుంచి వచ్చిన ‘ఇండియన్ 2’ పెద్దగా మెప్పించలేదు. ఈ నేపథ్యంలో ‘ది రాజాసాబ్’ కి ‘థగ్ లైఫ్’ పోటీ ఇవ్వగలుగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.