Begin typing your search above and press return to search.

థ‌గ్ లైఫ్ ముందుగానే వెళ్తుందా?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ -మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో 'థ‌గ్ లైఫ్' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Jan 2024 6:42 AM GMT
థ‌గ్ లైఫ్ ముందుగానే వెళ్తుందా?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ -మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో 'థ‌గ్ లైఫ్' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే సినిమాపై అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌మ‌ల్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి ప‌నిచ‌య‌డంతో? ఇద్ద‌రు భారీ ప్ర‌యోగానికే పూనుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించా ల‌ని ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

దానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు. కానీ చిత్రీక‌ర‌ణ ఫిబ్ర‌వ‌రి నుంచే మొద‌లు పెట్టా ల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. ఏప్రిల్ అంటే స‌మ్మ‌ర్ సీజ‌న్ కావ‌డంతో పాటు క‌మ‌ల్ హాస‌న్ డేట్లు కూడా మ‌రో సినిమాతో క్లాష్ అవ్వ‌డంతో ముందుకు తీసుకొస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. విక్ర‌మ్ హిట్ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ కొత్త ప్రాజెక్ట్ ల జోరు పెంచిన సంగ‌తి తెలిసిందే. హీరోగా న‌టిస్తూనే లోక‌నాయ‌కుడు విల‌న పాత్ర‌ల‌కు సైతం సై అంటున్నారు.

ఇప్ప‌టికే పాన్ ఇండియా చిత్రం 'క‌ల్కి 2898' లో విల‌న్ పాత్ర‌కి ఒకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అలాగే క‌మల్ సొంత బ్యానర్ లోనూ వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో క‌మ‌ల్ షెడ్యూల్ మునుప‌టిక‌న్నా బాగా బిజీ అయింది. అలాగే సౌత్ లో ఇత‌ర స్టార్ హీరోల‌తోనూ ప‌నిచేయ‌డానికి క‌మ‌ల్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాదిలో వాటిపైనా సీరియ‌స్ గా రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది.

ఈ క్ర‌మంలోనే 'థ‌గ్ లైప్' షూటింగ్ ని ముందుగానే ప్రారంభిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈసినిమా కోసం క‌మ‌ల్ ఎక్కువ‌గానే డేట్లు కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. క‌మ‌ల్ పాత్ర లో యాక్ష‌న్ పీక్స్ లో డిజైన్ చేయ‌డంతో అందుకోసం అవ‌స‌రం మేర విదేశాల్లోనూ భారీ షెడ్యూల్స్ ఉన్నాయ‌ట‌. తొలి షెడ్యూల్ చెన్నైలో మొద‌లు పెట్టి..చివ‌రిగా విదేశాల్లో షూటింగ్ ముగించాల‌న్న‌ది మ‌ణిర‌త్నం ప్లాన్ గా తెర‌పైకి వ‌స్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో తెలియాలి.