Begin typing your search above and press return to search.

థ‌గ్ లైఫ్ ని స్టార్ల‌తో నింపేస్తున్నారుగా!

మలయాళ నటుడు జోజు జార్జ్ - గౌతమ్ కార్తీక్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. దీంతో థ‌గ్ లైఫ్ లో అద‌న‌పు స్టార్స్ భాగ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 8:30 AM GMT
థ‌గ్ లైఫ్ ని స్టార్ల‌తో నింపేస్తున్నారుగా!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ -మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో 'థ‌గ్ లైఫ్' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే సినిమాపై అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌మ‌ల్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి ప‌నిచ‌య‌డంతో? ఇద్ద‌రు భారీ ప్ర‌యోగా నికే పూనుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇది గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది.


సినిమాని భారీ కాన్వాస్ పైనే తెర‌కెక్కిస్తున్నారు. త్రిష‌..జ‌యం ర‌వి..దుల్కార్ స‌ల్మాన్ లాంటి టాప్ స్టార్ల‌ను రంగంలోకి దించుతున్నారు. మెయిన్ లీడ్ క‌మ‌ల్ హాస‌న్ పోషించిన స‌పోర్టింగ్ రోల్స్ సైతం అంతే ధీటుగా ఉంటాయి. మ‌ణిర‌త్నం సినిమాలో ప్ర‌తీ పాత్ర ఎంతో బ‌లంగా ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.


మలయాళ నటుడు జోజు జార్జ్ - గౌతమ్ కార్తీక్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. దీంతో థ‌గ్ లైఫ్ లో అద‌న‌పు స్టార్స్ భాగ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా సెట్స్ కి వెళ్ల‌లేదు. ఇంకా ప్రీ అవ‌స‌ర‌మైన ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా న‌టీన‌టులంద‌ర్నీ ఎంపిక చేసిన త‌ర్వాత రెగ్యుల‌ర్ షూట్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌నుకున్నారు కానీ ఫిబ్ర‌వ‌రి నుంచే షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే వీలైనంత వేగంగా న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ అంటే స‌మ్మ‌ర్ సీజ‌న్ కావ‌డంతో పాటు క‌మ‌ల్ హాస‌న్ డేట్లు కూడా మ‌రో సినిమాతో క్లాష్ అవ్వ‌డంతో ముందుకు తీసుకొస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. విక్ర‌మ్ హిట్ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ కొత్త ప్రాజెక్ట్ ల జోరు పెంచిన సంగ‌తి తెలిసిందే. హీరోగా న‌టిస్తూనే లోక‌నాయ‌కుడు విల‌న్ పాత్ర‌ల‌కు సైతం సై అంటున్నారు. అందులోనే భాగంగానే క‌ల్కి 2898 కోసం విల‌న్ గా మారారు.