Begin typing your search above and press return to search.

సీక్వెల్ కి కలిసి వచ్చిన రీ రిలీజ్ బజ్..!

ఎలాగు తుంబాడ్ 2 తీసే ఆలోచనలో ఉన్న మేకర్స్ తుంబాడ్ ని రీ రిలీజ్ చేసి ఆ బజ్ క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:30 PM GMT
సీక్వెల్ కి కలిసి వచ్చిన రీ రిలీజ్ బజ్..!
X

స్టార్ సినిమా రీ రిలీజ్ హంగామాలో భాగంగా ఒకప్పటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.తెలుగు పరిశ్రమ నుంచి మొదలైన ఈ రీ రిలీజ్ హంగామా చిన్నగా హిందీ పరిశ్రమకు పాకింది. రీసెంట్ గా హిందీలో తుంబాడ్ సినిమా రీ రిలీజ్ చేశారు. ఆరేళ్ల క్రితం థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ను పెద్దగా అలరించలేకపోయింది. థియేట్రికల్ రన్ సోసోగానే నడించింది. ఐతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత మంచి బజ్ ఏర్పరచుకుంది.

సినిమాను ఓటీటీలో బాగా ఆదరించారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయ్యామే అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అది కాస్త వైరల్ గా మారి తుంబాడ్ మేకర్స్ చెవిన పడింది. ఎలాగు తుంబాడ్ 2 తీసే ఆలోచనలో ఉన్న మేకర్స్ తుంబాడ్ ని రీ రిలీజ్ చేసి ఆ బజ్ క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. ఐతే ఊహించిన దాని కన్నా ఎక్కువగానే తుంబాడ్ రీ రిలీజ్ సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టింది.

సినిమా మొదటి వారమే 14 కోట్ల దాకా రాబట్టగా నెల రోజుల్లో ఫుల్ రన్ లో 35 కోట్ల దాకా వసూలు చేసింది. ఇదేదో స్ట్రైట్ రిలీజ్ సినిమాగా కలెక్షన్స్ రాబట్టడం ఆ సినిమా మేకర్స్ కి షాక్ ఇచ్చింది. తుంబాడ్ సినిమాను రాహి అనిల్ బర్వే డైరెక్ట్ చేశారు. సోహుం షా, హర్ష్, జ్యోతి మాల్సే, మాధవ్ హరి జోషి ప్రధాన పాత్రలుగా నటించారు.

పాన్ ఇండియా లెవెల్ లో రీ రిలీజైన మొదటి హిందీ సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ చూసి తుంబాడ్ 2 మీద అంచనాలు పెరిగాయి. అంతేకాదు సీక్వెల్ ను ముందు అనుకున్న దాని కన్నా ఎక్కువ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లోనే తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. రీ రిలీజ్ టైం లో ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మరి తుంబాడ్ 2 ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారన్నది చూడాలి.