Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ల పెంపు?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల‌ టిక్కెట్ల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయ‌ని ఒక అంచ‌నా. ఈ సంక్రాంతికి ముగ్గురు అగ్ర హీరోలు న‌టించిన సినిమాలు రిలీజ‌వుతుండ‌గా టికెట్ పెంపుపై స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

By:  Tupaki Desk   |   1 Jan 2025 8:48 AM GMT
సంక్రాంతి సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ల పెంపు?
X

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల‌ టిక్కెట్ల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయ‌ని ఒక అంచ‌నా. ఈ సంక్రాంతికి ముగ్గురు అగ్ర హీరోలు న‌టించిన సినిమాలు రిలీజ‌వుతుండ‌గా టికెట్ పెంపుపై స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `గేమ్ ఛేంజ‌ర్` శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `డాకు మ‌హారాజ్`, విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` పోటీబ‌రిలో ఉన్న పెద్ద సినిమాలు. అందువ‌ల్ల వీటికి తొలి వారం టికెట్ ధ‌ర‌ల పెంపు వ‌ర్తించ‌నుంద‌ని భావిస్తున్నారు. ఈ మూడు సంక్రాంతి విడుదలలకు ఆంధ్రప్రదేశ్‌లో తేదేపా ప్రభుత్వం భారీ పెంపును మంజూరు చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ అసాధార‌ణ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన చిత్రం. శంక‌ర్ రాజీ లేకుండా లావిష్ గా తెర‌కెక్కించారు. దీనికోసం నిర్మాత దిల్ రాజు రాజీ అన్న‌దే లేకుండా బ‌డ్జెట్ వెచ్చించారు. అందువ‌ల్ల గేమ్ ఛేంజర్ నిస్సందేహంగా పండుగకు అతిపెద్ద చిత్రం. టికెట్ ధ‌ర‌ల పెంపుతోనే రిక‌వ‌రీ సాధ్య‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమాకు రూ. సింగిల్ స్క్రీన్‌లలో రూ.135 పెంపుదల వ‌ర్తించే వీలుంది. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.175 పెంచుతారు. 1 AM నుండి షెడ్యూల్ చేసిన బెనిఫిట్ షోల కోసం టికెట్ ధ‌ర‌ రూ. 600 (జీఎస్టీతో కలిపి) వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

బాలకృష్ణ `డాకు మహారాజ్‌`కు రూ. సింగిల్ స్క్రీన్‌లలో రూ.110 పెంపు ఉండ‌నుండ‌గా, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపు వ‌ర్తిస్తుంద‌ని అంచ‌నా. బాలయ్య చిత్రానికి ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలు షెడ్యూల్ చేసారు. బెనిఫిట్ షోల కోసం రూ.500 (జీఎస్‌టితో కలిపి) వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లకు రూ.75 అద‌నం కాగా, మల్టీప్లెక్స్‌లకు టిక్కెట్ రేటు పెంపుదల రూ. 100 వ‌ర‌కూ ఉంటుంది. మూడు చిత్రాలకు భారీ పెంపులు ఉండే ఛాన్సుంది. టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అధికారిక జీవో జారీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఓపెనింగ్స్ భారీగా వ‌చ్చే వీలుంది. అయితే సినిమాలో కంటెంట్ ప్ర‌జ‌ల‌కు న‌చ్చితేనే లాంగ్ రన్ ఉంటుంది. మ‌రోవైపు తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోల‌పై ఇంకా సందిగ్ధ‌త నెల‌కొంది.