టికెట్ రూ.99 కి తగ్గించినా అదే ఫలితం
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో కొన్ని సినిమాలను అందుకు భిన్నంగా టికెట్ తగ్గింపు ధరకు అందించే ప్రయత్నం జరుగుతోంది.
By: Tupaki Desk | 14 Jan 2025 5:05 AM GMTఈ సంక్రాంతి బరిలో విడుదలైన `గేమ్ ఛేంజర్` టికెట్ ధర రూ.350 పైగా ధర పలికింది. ఆన్ లైన్ బుకింగుల్లోనే ఈ పరిస్థితి ఉంటే, బ్లాక్ టికెటింగ్ లో ఎంత దారుణంగా విక్రయించి ఉంటారో ఊహించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. బాలయ్య `డాకు మహారాజ్`కి టికెట్ ధర పెంపు వర్తించింది.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో కొన్ని సినిమాలను అందుకు భిన్నంగా టికెట్ తగ్గింపు ధరకు అందించే ప్రయత్నం జరుగుతోంది. కేవలం 99కే సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు, మల్టీప్లెక్సుల్లో 177-200కే టికెట్ ను అందుబాటులో ఉంచాలనే ఆలోచన అక్కడ ప్లాన్ చేసారు. ఇందులో సోనూసూద్ నటించిన ఫతే చిత్రానికి, దేవగన్ మేనల్లుడు నటించిన ఆజాద్, కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రాలకు ఇలాంటి ఒక వ్యూహాన్ని అనుసరించనుండడం సర్వత్రా ఆసక్తిని కలిగించింది. టికెట్ ధరలను అదుపు తప్పకుండా తీసుకునే జాగ్రత్తలు కూడా ఈ ఏడాది ఆరంభం కలిసి రాలేదని ఇప్పటికే విడుదలైన `ఫతే` చిత్రం నిరూపిస్తోంది. సోనూ సూద్ వయోలెంట్ యాక్షన్ తో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్లు గగుర్పాటుకు గురి చేసాయి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని డైలమాలోకి నెట్టింది. ఈ సినిమాకి సెలవు దినాలలో కూడా ఆశించినంతగా ఓపెనింగులు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే, జనవరి 17న విడుదల కానున్న ఆజాద్, ఎమర్జెన్సీ చిత్రాల పరిస్థితి ఏమిటన్నది వేచి చూడాలి. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ రోజులపై తీసిన ఎమర్జెన్సీ చిత్రం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని ఇప్పటికి విడుదలవుతోంది. దేవగన్ తన మేనల్లుడు అమన్ దేవగన్ ని తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన ఆజాద్ ని హిట్ చిత్రంగా నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఈ ఇద్దరి హోప్ తగ్గించిన టికెట్ ధరపైనే. కానీ అది ఎంతవరకూ వర్కవుటవుతుంది? అంతగా బజ్ లేకుండా ఇవి వస్తున్నాయని కూడా ట్రేడ్ చెబుతోంది.
జనవరి 20లోపు విడుదలయ్యే సినిమాలేవీ అంతగా బజ్ ని క్రియేట్ చేయడం లేదని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే జనవరి 25న విడుదల కానున్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ `స్కై ఫోర్స్`పైనే ఆశలన్నీ. కానీ ఈ చిత్రం హృతిక్ రోషన్ ఫైటర్ తరహా ప్రయోగం. దీనిని ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. స్కై ఫోర్స్ చిత్రంతో వీర్ పహారియా తెరకు పరిచయం అవుతున్నాడు. కనీసం జనవరి చివరిలో వస్తున్న స్కైఫోర్స్ విజయం సాధించినా అది బాలీవుడ్ లో కొత్త ఉత్సాహం నింపుతుంది. తదుపరి విడుదల కానున్న చిత్రాలకు కొంతవరకూ బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఏం జరగనుందో కాస్త వేచి చూడాలి.