Begin typing your search above and press return to search.

అనుపమని ఫ్లర్ట్ చేస్తోన్న టిల్లు బాయ్..!

ఆ పాట కు ముందు హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణను ప్రోమోగా విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   24 July 2023 12:50 PM GMT
అనుపమని ఫ్లర్ట్ చేస్తోన్న టిల్లు బాయ్..!
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రూట్ మార్చిన సిద్ధుకు.. డీజే టిల్లు మూవీ తో బ్రేక్ లభించింది. దీంతో యూత్‌ లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్'పేరుతో సీక్వెల్ చేస్తూ షూటింగ్‌లో బిజీ గా ఉన్నాడు. ఈ మూవీ కూడా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.


తాజాగా, ఈ మూవీ నుంచి ఓ పాట విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అయ్యారు.'టికెటే కొనకుండా' అనే పాటను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే, ఈ పాట విడుదల చేయడానికి ముందు సాంగ్ కి ఓ ప్రోమో వదిలారు. మామూలుగా అయితే, పాట కి ప్రోమో అంటే, పాటలోని కొన్ని క్లిప్స్ కొంచెం మ్యూజిక్ వదులుతారు. కానీ, ఇది టిల్లు మూవీ, అన్నిమూవీల్లా ఉంటే ఇది టిల్లూ స్క్వేర్ ఎందుకు అవుతుంది.

అందుకే, ఆ పాట కు ముందు హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణను ప్రోమోగా విడుదల చేశారు. ఆ ప్రోమో ప్రకారం, జస్ట్ అప్పుడే టిల్లూ, హీరోయిన్ ని చూస్తాడు. చూసినవెంటనే, ఆమెకు లైన్ వేయడం మొదలుపెడతాడు. మెల్లగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ వివరాలు అడగడం మొదలుపెట్టాడు. హీరో ఫ్లర్ట్ చేస్తున్నాడని అనుపమ కు అర్థమై, ఇప్పుడే కదా కలిసావు, అప్పుడే ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తావా అంటూ అడగుతుంది. ఇక టిల్లూ తన స్టైల్ లో నేను ఫ్లర్ట్ చేసే విషయం నీకు తెలియాలి కదా, లేకపోతే చేసి ఏం లాభం అంటూ సమాధానం చెప్పడం విశేషం.

ఇక, వారి మధ్య డైలాగ్సే ఇలా ఉన్నాయంటే, పాట ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇక ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఆగస్టు లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, స్టార్ హీరోల సినిమాల కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది.

ఇక, ఈ మూవీ వినాయక చవితి సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మొదటి పార్ట్ లో నేహా శెట్టి నటించింది. ఆమెది అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. మరి అనుపమ పాత్రను ఎలా డిజైన్ చేశారో చూడాలి. ఇక అనుపమ, ఈ మూవీ లో చాలా బోల్డ్ సీన్స్ కూడా నటించినట్లు సమాచారం.