'గేమ్ ఛేంజర్' - అడ్వాన్స్ బుకింగ్స్ లో గట్టిగానే..
రివ్యూలు కూడా పెద్దగా పాజిటివ్ గా రాకపోవడంతో బాక్సాఫీస్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 11 Jan 2025 5:09 AM GMTసంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ముందుగానే విడుదలైన గేమ్ ఛేంజర్ ఊహించని టాక్ ను అందుకుంది. రివ్యూలు కూడా పెద్దగా పాజిటివ్ గా రాకపోవడంతో బాక్సాఫీస్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలైన ఈ పొలిటికల్ డ్రామా భారీ అంచనాల నడుమ థియేటర్లలో సందడి చేసింది. ఇక చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించగా, అంజలి మరో కీలక పాత్రలో మెప్పించింది.
ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం, గేమ్ ఛేంజర్ బుక్మైషోపై ప్రారంభ రోజే సాలీడ్ రికార్డ్ అందుకున్నట్లు తెలుస్తోంది. టాప్ బెస్ట్ బుకింగ్స్ లో ఇది కూడా నిలవడం విశేషం. ట్రైలర్ ద్వారా కాస్త ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ను గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో బుకింగ్స్ కూడా గట్టిగానే జరిగాయి. మొదటి రోజు బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1.3 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఈ భారీ స్పందన సినిమాపై ఉన్న అంచనాలను రుజువు చేస్తోంది. ప్రీమియర్ షోల్లోనే అభిమానుల నుండి వచ్చిన టాక్ అటు ఇటుగా ఉన్నా, శుక్రవారం నుంచి వీకెండ్ వరకు టికెట్ అమ్మకాలు మరింత పెరగడానికి దోహదం చేస్తుంది. బుక్మైషోనే కాకుండా ఇతర టిక్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలోనే కాకుండా, తమిళనాడు, ఉత్తరాదిలో కూడా గేమ్ ఛేంజర్ కు డిమాండ్ పెరిగింది. పెద్ద నగరాల్లో చాలా షోలు సాల్డ్ అవుట్ లేదా ఫాస్ట్ ఫిల్లింగ్‌గా ఉండటం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఇక టాప్ లిస్ట్ ఒకసారి చూస్తే..
బుక్ మై షోలో ఇటీవల కాలంలో మొదటి రోజు అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడైన టిక్కెట్లు ఈ విధంగా ఉన్నాయి. (అడ్వాన్స్+డే1) -
పుష్ప2 - 46.84L
కల్కి 2898AD - 28.73L
సలార్ - 27.05L
దేవర - 19.09L
గేమ్ ఛేంజర్ - 11.74L
గుంటూరు కారం - 9.68L
ఇక పండగ సీజన్ సినిమాకు మరింత బలాన్ని ఇస్తూ, రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ కొత్త రికార్డులను సృష్టించబోతోందో చూడాలి. టాక్ ను బట్టి చూస్తే సినిమా నిలదొక్కుకోవాలి అంటే దేవర తరహాలో మ్యాజిక్ జరగాలి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కాలేజ్ యువకుడిగా, ఐఏఎస్ అధికారిగా, తండ్రిగా మూడు విభిన్న పాత్రలు పోషించి తన నటనతో అందరినీ మెప్పించారు.
ఆయనతో పాటు ఎస్జే సూర్యా, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్ వంటి నటులు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. తమిళనాడులో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా హిందీలో అజిత్ థడానీ ద్వారా విడుదలైంది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన ఇస్తున్నారు.