30 కోట్ల నుంచి 9కోట్లకు పడిపోయిన స్టార్ హీరో
బాక్సాఫీస్ నంబర్లు మాత్రమే అతడి ఫేట్ ని డిసైడ్ చేసాయి. ప్రతిభావంతుడైన ఈ స్టార్ ఎవరో పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 21 Dec 2024 3:57 AM GMTభారతదేశంలో అత్యుత్తమ యాక్షన్ హీరోలలో అతడు ఒకడు. మార్షల్ ఆర్ట్స్ లో జాన్ ర్యాంబో స్టాలోన్ అంతటి ప్రతిభావంతుడు. హాలీవుడ్ యాక్షన్ చిత్రం `ర్యాంబో` భారతీయ వెర్షన్‌లో నటించాలని కలలు కన్నాడు. హృతిక్ రోషన్ అంతటి పెద్ద స్టార్ యాక్షన్ లో, డ్యాన్సుల్లో తనతో పోటీపడే ఏకైక సమర్థుడు అంటూ అతడికి కితాబిచ్చాడు. కానీ ఇవేవీ అతడిని ఆదుకోలేదు. బాక్సాఫీస్ నంబర్లు మాత్రమే అతడి ఫేట్ ని డిసైడ్ చేసాయి. ప్రతిభావంతుడైన ఈ స్టార్ ఎవరో పరిచయం అవసరం లేదు. జాకీ ష్రాఫ్ నటవారసుడు టైగర్ ష్రాఫ్.
టైగర్ లో ప్రతిభకు కొదవేమీ లేదు. యాక్టర్ గా, డ్యాన్సర్ గా ఫైటర్ గా ఆల్ రౌండర్ ప్రతిభ అతడి సొంతం. కానీ ఇటీవల వరుస ఫ్లాప్ లు అతడి కెరీర్ గ్రాఫ్ ని ఒక్కసారిగా కిందికి దించేసాయి. భాఘి ఫ్రాంఛైజీ సినిమాలతో పాటు, వార్ చిత్రంతో అతడు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఆ సమయంలో అతడి పారితోషికం రేంజ్ 30కోట్లు. కానీ ఇప్పుడు అది 9కోట్లకు పరిమితమైంది. అతడు ఇప్పుడు ఒక్కో సినిమాకి 10 కోట్ల లోపు పారితోషికంతో ఒప్పందాలు చేసుకుంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి.
2014లో వచ్చిన హీరోపంటి సినిమాతో టైగర్ ప్రయాణం మొదలైంది. దీని తరువాత బాఘీ, బాఘీ 2 అతన్ని పరిశ్రమలో స్టార్‌గా నిలదొక్కుకునేలా చేసాయి. అయితే గత రెండు మూడేళ్లుగా టైగర్ ష్రాఫ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. హీరోపంతి 2, గణపత్, బడే మియాన్ చోటే మియాన్, సింగం ఎగైన్ వంటి సినిమాలు పెద్ద నిరాశను మిగిల్చాయి. ముఖ్యంగా హీరోపంటి 2, బడే మియాన్ చోటే మియాన్ డిజాస్టర్లుగా మారడం అతడి కెరీర్ ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. పారితోషికంలో అతడు తన స్థాయిని పూర్తిగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టైగర్ తన కెరీర్ లో బిగ్ బ్రేక్ కోసం ఆశతో `బాఘీ 4` కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ సినిమా అతడి కెరీర్ కి తిరిగి బిగ్ బూస్ట్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పరిశ్రమకు సక్సెస్ ఒక్కటే గీటురాయి. అది లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. ఇండస్ట్రీలో ప్రతి సినిమాతో నిరూపించాలి.. దానికోసం కష్టపడి సక్సెస్ అందుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని ఔత్సాహిక నటీనటులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.