కత్రినా టవల్ ఫైట్‌తోనే 'టైగర్ 3' ప్రమోషన్ స్టార్ట్
ఈ సన్నివేశం తామిద్దరు చాలా కష్టపడినట్లు కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మిచెల్.
By: Tupaki Desk | 27 Oct 2023 4:32 PM GMTటైగర్ 3తో దీపావళికి రాబోతున్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. రీసెంట్గా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్ ఫైట్స్ ఎంతలా ఆకట్టుకున్నాయో అంతకన్నా ఎక్కువగా కత్రినా కైఫ్ బాత్ టవల్ సీక్వెన్ అలరించాయి. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియా అంతా కత్రినా టవల్ ఫైటే కనిపించింది. అయితే ఇప్పుడు ఈ కత్రిన టవల్ ఫైట్‌తోనే ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్.
వివరాళ్లోకి వెళితే.. టైగర్ 3 నవంబర్ 12న హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ కానుంది. అంటే ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. అందుకే మూవీటీమ్ ఇక ప్రమోషన్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు రెడీ అయింది. అందుకు కావాల్సిన ప్రమోషనల్ మెటీరియల్ కంటెంట్ కూడా రెడీ అయిందట. ఎలాగైనా సినిమా అన్నీ భాషల వారికి రీచ్ అయ్యేలా, భారీ ఓపెనింగ్స్ దక్కేలా ప్లాన్ చేసుకుంటుందట.
అందుకే ప్రమోషన్స్‌ను ముందుగా... ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన కత్రిన టవల్ ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పటికే ఇది చూసి నెటిజన్లు, సల్మాన్ భాయ్ అభిమానులు, ఇతర సినీ ప్రియులంతా ఇదొక్క సీన్ చాలు రూ.1000కోట్లు వచ్చేస్తాయి అంటూ కామెంట్లు కూడా పెట్టారు. అంతలా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ టవల్ సీక్వెన్స్‌లో కత్రినతో పాటు తలపడింది హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
ఈ సన్నివేశం తామిద్దరు చాలా కష్టపడినట్లు కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మిచెల్.ఈ సీక్వెన్స్ కోసం తామిద్దరు రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. టవల్స్‌ను హ్యాండిల్ చేయడం పెద్ద సవాల్‌గా మారిందని అన్నారు. అయినా ప్రొఫెషనల్ యాక్టర్స్ కావడం, పైగా ప్రాక్టీస్ చేయడం బాగా ఉపయోగపడిందని అన్నారు.
అలానే ఓ చిన్న సన్నివేశం భారీ స్థాయిలో నెట్టింట్లో వైరల్ కావటంపై తానేమీ ఆశ్చర్యపోవటం లేదని అన్నారు మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించినట్లు చెప్పారు. అసలీ ఫైట్ సీన్‌ను ఎలా చేయాలి, ఎంత కొత్తగా చేస్తే ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా, యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో స్పై యూనివర్స్‌లో భాగంగా 'టైగర్ 3' సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.