Begin typing your search above and press return to search.

'టైగర్ 3' ఫేక్ క‌లెక్ష‌న్స్ హంగామా?

ఇటీవ‌ల టైగ‌ర్ 3 చూసే కంటే క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకే అభిమానులు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఉన్నార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:31 AM GMT
టైగర్ 3 ఫేక్ క‌లెక్ష‌న్స్ హంగామా?
X

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 సినిమా చర్చనీయాంశమైంది. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు అత్యంత భారీ వ‌సూళ్లు రాబట్టింది అంటూ ప్ర‌చారం హోరెత్తుతోంది. ఈ చిత్రం జవాన్ - గదర్ 2 త‌ర‌హాలో మంచి విజయం సాధించలేకపోయింది కానీ బాక్సాఫీస్ సంఖ్య పరంగా పూర్తి వైఫల్యం కాదు అని చెబుతున్నారు. అయితే టైగ‌ర్ 3 మేకర్స్ అన‌వ‌స‌రంగా నకిలీ బాక్సాఫీస్ నంబర్లను వైర‌ల్ చేస్తున్నార‌ని, ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అని వాదించే వారు లేక‌పోలేదు.

ఇటీవ‌ల టైగ‌ర్ 3 చూసే కంటే క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకే అభిమానులు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఉన్నార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది. గైటీ గెలాక్సీ యజమాని మనోజ్ దేశాయ్ టైగ‌ర్ 3 అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టారు. మనోజ్ దేశాయ్ బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన అనుభ‌వ‌జ్ఞుడ‌. తన మాటలను తప్పుపట్టకుండా ఎప్పుడూ నిజాలు మాట్లాడడంలో ముందుంటారు. పఠాన్, జవాన్, గదర్ 2 సమయంలో గైటీ గెలాక్సీ అద్భుతమైన స్పందనను అందుకుంది. మనోజ్ దేశాయ్ స్వ‌యంగా స్పందిస్తూ షారూఖ్ ఖాన్, సన్నీ డియోల్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. టైగర్ 3తో కూడా అదే ఆశించారు. ఈ చిత్రం మొదటిరోజు, రెండవ రోజు చాలా బాగా ఆడింది. థియేటర్లు హౌస్‌ఫుల్‌గా సాగినా మూడో రోజు తగ్గుముఖం పట్టింది. ఈ సినిమాపై మనోజ్ దేశాయ్ తన నిరాశను వ్యక్తం చేశాడు.

టైగర్ 3 బాగా ఆడలేదు: మనోజ్ దేశాయ్

ఇదే విషయమై ఆయన మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, ''బ‌హుత్ ఉమ్మీద్ లగా కే రాఖీ థీ... లేకీన్ జబ్ పిక్చర్ ఫుల్ నహీ గయీ తో మెయిన్ బోహోట్ అప్‌సెట్ హు. సూపర్ డూపర్ హిట్ వాలీ బాత్ నహీ రహీ హై'' అని చెప్పాడు. టైగర్ 3పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. అది కుదరక పోవడంతో బాధపడ్డాను. ఇప్పుడు సినిమాలో సూపర్ డూపర్ హిట్ అంటూ ఏమీ లేదు.. అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆదివారం తర్వాత, స్పందన ఒకేలా లేదని కూడా ఆయన తెలిపారు. సినిమా కథాంశం గురించి కూడా ఆయ‌న‌ చెప్పాడు. తాను సినిమా చూడలేదని, అయితే తాను విన్నదాని ప్రకారం పాక్ ప్రధానిని టైగర్ రక్షించబోతున్నాడనే కథాంశమిది అని ఆయన స్పష్టం చేశారు.

ఫ్రాంఛైజీలో క‌థ గాడి త‌ప్పిందా?

నిజానికి టైగ‌ర్ ఫ్రాంఛైజీలో పార్ట్ 3 క‌థ గాడి త‌ప్పింద‌నేది ఒక వాద‌న‌. భారత్‌-పాకిస్థాన్‌లు ఎప్పటినుంచో శత్రుదేశాలే కాబట్టి భార‌తీయ స్పై పాక్ ప్ర‌ధానిని కాపాడ‌ట‌మేంటి? నిజానికి భారత్‌లో ఈ తరహా కథనం పనిచేయదు. పాకిస్తాన్ ప్రపంచ కప్ నుండి నిష్క్రమించినప్పుడు భారతదేశంలోని ప్రజలు రాత్రంతా సంబరాలు చేసుకున్నారు. వారి వల్ల మన సైనికులు చనిపోయారు. వారితో మనమందరం కలత చెందాము. ఇప్పుడు 'టైగర్ 3'లో వారు రెండు దేశాల సంబంధాల్లో మంచి గురించి ఆలోచించాలి అని చూపించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. గైటీ గెలాక్సీ యాజమాన్యం మాత్రం సినిమా పెద్దగా ఆడలేదని స్పష్టం చేసింది. కాబట్టి, టైగర్ 3 నిర్మాతలు నకిలీ నంబర్లు ఇస్తున్నారా? అంటూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

కమల్ ఆర్ ఖాన్ విమర్శలు:

బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అకా KRK కూడా ఈ వీడియో గురించి మాట్లాడాడు. టైగర్ 3 నిర్మాతలు నకిలీ నంబర్లను చూపిస్తున్నారని అన్నారు. KRK దాని గురించి X (గతంలో ట్విట్టర్) లో రాశారు. అతను ఇలా రాశాడు, ''గైటీ గెలాక్సీ యజమాని మనోజ్ దేశాయ్ వీడియో వైరల్ #టైగర్3 చిత్రం డిజాస్టర్ అని అతను చెబుతున్నాడు. అతని థియేటర్లు 20 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడుస్తున్నాయి. నిర్మాతలు నకిలీ కలెక్షన్లు ఇస్తున్నారని చెప్పాడు'' అంటూ కేఆర్క్ రాసారు. మొత్తానికి టైగ‌ర్ 3 ఒరిజినల్ క‌లెక్ష‌న్స్ ఎంత అన్న‌దానిపై ఇక‌నైనా క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.