టైగర్ గాండ్రింపు తొలి రోజేనా?
పండగ రోజున సినిమాలు రిలీజ్ చేయడం అన్నది సల్మాన్ ఖాన్ ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటాడు. అన్ని కుల మాతాల్ని గౌరవిస్తూ ఖాన్ భాయ్ తన చిత్రాల్ని ఏటా రిలీజ్ చేస్తుంటాడు.
By: Tupaki Desk | 15 Nov 2023 12:30 AM GMTపండగ రోజున సినిమాలు రిలీజ్ చేయడం అన్నది సల్మాన్ ఖాన్ ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటాడు. అన్ని కుల మాతాల్ని గౌరవిస్తూ ఖాన్ భాయ్ తన చిత్రాల్ని ఏటా రిలీజ్ చేస్తుంటాడు. తెలివిగా ఆ సెలవు రోజుల్ని ఎన్ క్యాష్ చేసుకుంటాడు. అలాగని మిగతా హీరోల చిత్రాలు పండగ రిలీజ్ లు ఉండవని కాదు. కానీ వాళ్లందరికంటే ఎక్కువగా సల్మాన్ రిలీజ్ లు పెట్టుకుంటాడు. అందుకే ఏ జాతీయ పండుగను మిస్ చేయడు.
తాజాగా దివాలీ సందర్భంగా భారీ అంచనాల మధ్య `టైగర్ -3` తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ కటౌట్ చూసి సల్మాన్ పఠాన్...జవాన్ లాంటి రికార్డులను తిరగరాస్తాడని అభిమానులు భావించారు. అంతకు ముందు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతోనే బోలెడంత హైప్ తీసుకొచ్చాడు. కానీ రిలీజ్ తర్వాత టైగర్ -3 హడావుడి ఎక్కడా కనిపించలేదు. ఆదివారం రిలీజ్ కావడంతో తొలి రోజు భారీగానే గ్రాస్ రాబట్టింది.
45 కోట్ల వసూళ్లతో సల్మాన్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా నిలిచింది. సల్మాన్ వరకూ భారీ వసూళ్లే కానీ `పఠాన్`..`జవాన్` తొలి రోజు వసూళ్లతో పోల్చితే చాలా తక్కువే. తాజా రిపోర్ట్ ప్రకారం సినిమా వసూళ్లు భారీగా తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. అందుకు సల్మాన్ ఓ రాంగ్ టర్న్ తీసుకున్నట్లు హైలైట్ అవుతుంది. ఆదివారం రిలీజ్ అన్నది సరైన రిలీజ్ సమయం కాదని తెరపైకి వస్తుంది.
సోమవారం నుంచి యధావిధిగా స్కూల్స్ కాబట్టి వసూళ్లు తగ్గడం సహజం. అదే శుక్రవారం రిలీజ్ అయితే వీకెండ్ మొత్తం కలిసొచ్చేది. కంటెంట్ ఎలా ఉన్నా కొన్ని సార్లు రిలీజ్ సమయం కూడా అంతే కీలకమ వుతుంది. తాజాగా సినిమాకి వచ్చిన డివైడ్ టాక్ వల్ల లాంగ్ రన్ లో నిలబడటం కష్టమనే ప్రచారం సాగుతుంది. ఇప్పటివరకూ వరుస పరాజయాల్ని భాయ్ ని ఇబ్బంది పెడుతున్నాయి. కొంత కాలంగా సరైన సక్సెస్ ఒక్కటీ లేదు. టైగర్ -3 తోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడంటే? ఆ ఊపు ఎక్కడా కనిపించలేదు.