Begin typing your search above and press return to search.

టైగర్ 3.. ఇంకా ఎంత రావాలంటే..

సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిన టైగర్ 3 మూవీ తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. ఏక్ ది టైగర్ సిరీస్ లో పార్ట్ 3 గా ఈ మూవీ తెరకెక్కింది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 5:07 AM GMT
టైగర్ 3.. ఇంకా ఎంత రావాలంటే..
X

సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిన టైగర్ 3 మూవీ తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. ఏక్ ది టైగర్ సిరీస్ లో పార్ట్ 3 గా ఈ మూవీ తెరకెక్కింది. యష్ రాజ్ స్పై థ్రిల్లర్ సిరీస్ లలో ఇది ఒకటి. కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ఈ ఏడాదిలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

అదే యష్ రాజ్ నుంచి వచ్చిన టైగర్ 3 మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ కొంత వరకు మంచి కలెక్షన్స్ వచ్చిన తరువాత క్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు టైగర్ 3 మూవీ దేశ వ్యాప్తంగా 288 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ ఇమేజ్ తో చూసుకుంటే ఈ కలెక్షన్స్ చాలా తక్కువ అని చెప్పాలి. హిందీతో పాటు ఇతర భాషలలో కూడా టైగర్ 3 మూవీ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేసిన కథనం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో వారం రోజులకే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 101 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఈ పరిస్థితిలో బ్రేక్ ఈవెన్ అందుకోవడం సాధ్యం అవుతుందా అనేది చెప్పలేని విషయం.

ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ కిసికి భాయ్ కిసికా జాన్ సినిమాతో ఇప్పటికే డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. టైగర్ 3తో మరో డిజాస్టర్ అతని లిస్టులో చేరే ఛాన్స్ ఉంది. ఒక వేళ టైగర్ 3 డిజాస్టర్ అయితే మాత్రం ఈ సీక్వెల్స్ కి యష్ రాజ్ ఎండ్ కార్డ్ వేసేసే అవకాశం ఉండొచ్చు. అయితే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ టైగర్ వెర్సస్ పఠాన్ అనే టైటిల్ తో మూవీ ప్లానింగ్ కి రెడీ అయ్యింది.

ఇది సపరేట్ కథాంశం అనే టాక్ వినిపిస్తోంది. టైగర్ సిరీస్ నుంచి సల్మాన్ పాత్రని పఠాన్ మూవీ నుంచి షారుఖ్ రోల్ తీసుకొని డిఫరెంట్ కంటెంట్ తో ఆ సినిమా చేయాలని ప్లానింగ్ ప్రస్తుతం యాష్ రాజ్ లో అయాన్ ముఖర్జీ చేస్తోన్న వార్ 2 తర్వాత ఈ మూవీ ఉండే అవకాశం ఉంది.