ఒంటరిగా ఉన్నారా? అని తుంటరిగా ప్రశ్నించాడు!
ఇంతలోనే టైగర్ ష్రాఫ్ కి లవ్ బ్రేకప్ గురించి బోలెడన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి
By: Tupaki Desk | 23 Aug 2023 4:21 AM GMTబాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లవ్ బ్రేకప్ గురించి తెలిసిందే. దిశా పటానీకి తాను స్నేహితుడిని మాత్రమేనని అతడు కన్ఫామ్ చేసాడు. ఆ తర్వాత దిశా పటానీ చాలా కాలం ఒంటరిగా ఉంది. చివరికి తన జిమ్ కోచ్ తో ప్రేమలో పడింది. ఈ జంట ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ఇంతలోనే టైగర్ ష్రాఫ్ కి లవ్ బ్రేకప్ గురించి బోలెడన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ ఇటీవల తన అభిమానులతో సరదా సంభాషణలు చేసాడు. ఓ అభిమాని ష్రాఫ్‌ను ఒంటరిగా ఉన్నారా? అని కొంటెగా ప్రశ్నించాడు. దానికి ప్రతిస్పందనగా టైగర్ నవ్వుతూ ''నా పనిని నేను వివాహం చేసుకున్నాను'' అని నొక్కి చెప్పాడు. అయితే టైగర్ ష్రాఫ్ కి జిమ్ కోచ్ గా పని చేసిన సన్నిహితుడితోనే దిశా పటానీ ప్రేమాయణం సాగించడంపై టైగర్ అభిమానులు జీర్ణించుకోలేనిది.
దిశా పటానీ సహా గతంలో పలువురు నటీమణులతో టైగర్ ష్రాఫ్‌కు సంబంధం ఉంది. అయితే అతడు తన రిలేషన్షిప్ స్టాటస్‌ను ఎప్పుడూ ధృవీకరించలేదు. ప్రస్తుతం అతడు పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ చేసానని చెబుతున్నాడు. తన తదుపరి చిత్రం గణపత్ పార్ట్ 1 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.
వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, వికాస్ బహ్ల్ నిర్మించారు. ఇది 20 అక్టోబర్ 2023న విడుదల కానుంది. గణపత్ పార్ట్ 1 తన కెరీర్లో అతిపెద్ద సవాల్ గా ఉన్న చిత్రాలలో ఒకటిగా టైగర్ పేర్కొన్నాడు. ఈ సినిమాతో పాటు బాఘీ 4, బడే మియాన్ చోటే మియాన్, రాంబో చిత్రాల్లో టైగర్ నటిస్తున్నాడు.