Begin typing your search above and press return to search.

'ర్యాంబో' రీమేక్‌లో టైగ‌ర్-జాన్వీ క్రేజీగా..

నిజానికి రాంబో కంటే ముందే టైగర్ -జాన్వి ఇదివ‌ర‌కూ అలీ అబ్బాస్ జాఫర్ 'బడే మియాన్ చోటే మియాన్‌'లో క‌నిపిస్తారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 4:00 AM GMT
ర్యాంబో రీమేక్‌లో టైగ‌ర్-జాన్వీ క్రేజీగా..
X

హాలీవుడ్ భారీ యాక్ష‌న్ చిత్రం 'ర్యాంబో' భారతీయ వెర్షన్ పున‌ర్నిర్మాణంపై చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం ఇండియా వెర్ష‌న్ లో టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై ప‌ని జ‌రుగుతోంది. నిజానికి ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా ప్రీలుక్ 2017లో ఆవిష్కరించినా కానీ.. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చిత్రీక‌ర‌ణ ఆలస్యం అయింది. అయితే ఎట్ట‌కేల‌కు 'ర్యాంబో' రీమేక్ పనులు ఇక‌పై ఊపందుకునేలా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో పాటు జాన్వీ కపూర్ నటించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. రోహిత్ ధావన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించే ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో జాన్వి క‌పూర్ నాయిక‌గా న‌టించ‌నుంది. టైగర్‌తో జాన్వీ తొలి క‌ల‌యిక ఇది.. అని తెలుస్తోంది. గతంలో అనేక ప్రయత్నాల తర్వాత టైగర్ - జాన్వి చివరకు కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాంబోలో జాన్వీ పాత్ర వివరాలు గోప్యంగా ఉంచారు. అయితే క‌థానుసారం ఈ చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇద్దరు నటీనటులు చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. చివరకు వృత్తిపరంగా క‌లిసి ప‌ని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు అని ప్రాజెక్ట్‌కి స‌న్నిహిత సోర్స్ చెబుతోంది.

నిజానికి రాంబో కంటే ముందే టైగర్ -జాన్వి ఇదివ‌ర‌కూ అలీ అబ్బాస్ జాఫర్ 'బడే మియాన్ చోటే మియాన్‌'లో క‌నిపిస్తారు. అలాగే ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని మ‌రో యాక్షన్ థ్రిల్లర్‌లో కలిసి పని చేయనున్నారు. జగన్ శక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్‌లు షెడ్యూల్స్ వివాదాల కారణంగా వాయిదా ప‌డ్డాయి. ఒక సోర్స్ వివ‌రాల ప్ర‌కారం.. రాంబో రీమేక్ షూటింగ్ జనవరి 2024లో ప్రారంభం కానుంది.

యూరప్‌లోని వివిధ లొకేషన్‌లలో భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. నిర్మాత- దర్శక ద్వ‌యం ఒక అద్భుతమైన భారతీయ యాక్షన్ హీరోని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా తెలుస్తోంది. దీని కోసం టైగర్ ర‌క‌రకాల‌ ఆయుధాలు గెరిల్లా యుద్ధంలో అంతర్జాతీయ నిపుణుల నుండి కఠినమైన శిక్షణ పొందుతారు. అతడు తన దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి దిగిన దుష్ట‌శ‌క్తుల భారి నుంచి కాపాడేందుకు స్వదేశానికి తిరిగి వచ్చే ఎలైట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిట్‌లో జీవించి ఉన్న చివరి సభ్యుని పాత్రను పోషిస్తాడని కూడా టాక్ ఉంది.

సిద్ధార్థ్ ఆనంద్ - రోహిత్ ధావన్ బృందం ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా పని చేస్తున్నారు. సిల్వెస్టర్ స్టాలోన్ పాత్ర‌ను ప్ర‌తిబింబించేలా టైగర్‌ను తీర్చిదిద్దేందుకు వారు త‌పించ‌నున్నారు. అతని పాత్రను జాన్ J. రాంబో నుండి వేరు చేస్తూ యూనిక్ గా చూపించాల‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. భారతీయ రాంబో అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌తో కూడిన అద్భుత చిత్రంగా నిలిచేలా చూసేందుకు మేకర్స్ ఎటువంటి అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. ఈ సినిమాకి అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్చించ‌నున్నార‌ని తెలిసింది.