Begin typing your search above and press return to search.

టైగర్‌ : తప్పుడు నిర్ణయంతో రూ.100 కోట్లు నష్టం

దీపావళి సందర్భంగా విడుదల అయిన టైగర్ 3 సినిమాను సౌత్‌ సినీ ప్రేక్షకులు పట్టించుకోలేదు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:57 AM GMT
టైగర్‌ : తప్పుడు నిర్ణయంతో రూ.100 కోట్లు నష్టం
X

చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేక కష్టాలు పడుతున్న సల్మాన్‌ ఖాన్ ఎట్టకేలకు టైగర్ 3 సినిమా తో పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు దక్కించుకుంటూ ఉన్నాడు. దీపావళి సందర్భంగా విడుదల అయిన టైగర్ 3 సినిమాను సౌత్‌ సినీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఉత్తరాది ప్రేక్షకులు మరియు ఓవర్సీస్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు టైగర్‌ 3 సినిమాకు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఈ మధ్య కాలంలో సల్మాన్‌ ఖాన్‌ కి ఇది చాలా పెద్ద నెంబర్‌. ఇక మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లు రాబట్టింది. మూడో రోజు వరకు ఏకంగా రూ.180 కోట్ల వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం విశేషం.

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లు సాలిడ్‌ గా వచ్చాయి అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వర్గాల వారు మాత్రం రిలీజ్ విషయంలో మేకర్స్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అయిందని అంటున్నారు. అసలు విషయానికి వస్తే పండుగ మరియు క్రికెట్‌ వల్ల టైగర్‌ 3 కి వంద కోట్ల దెబ్బ పడింది.

వివరాల్లోకి వెళితే... దీపావళి రోజు ఈ సినిమాను ఎక్కువ మంది చూడలేదు. రెండో మరియు మూడో రోజు వసూళ్లు ఎక్కువ ఉండటం ను బట్టి దీపావళి రోజు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని అర్థం అవుతోంది. ఇక ప్రపంచ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్‌ లు జరిగిన సమయంలో కూడా టైగర్ 3 కలెక్షన్స్ డ్రాప్‌ అయ్యాయి.

ముఖ్యంగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ రోజు టైగర్‌ 3 కలెక్షన్స్ డ్రాప్‌ అయ్యాయి. మొత్తానికి పండుగ మరియు క్రికెట్‌ మ్యాచ్‌ వల్ల టైగర్‌ 3 సినిమా కు వసూళ్ల విషయం లో దెబ్బ పడినట్లు అయింది.

పండుగ సందర్భంగా కాకుండా, క్రికెట్‌ మ్యాచ్ లు పూర్తి అయిన తర్వాత టైగర్ ను తీసుకు వచ్చి ఉంటే కచ్చితంగా మరో వంద కోట్లు సల్లూ భాయ్‌ రాబట్టగలిగేవాడు అనేది బాక్సాఫీస్‌ వర్గాల వారి మాట. రూ.300 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన టైగర్‌ 3 సినిమా వసూళ్ల విషయం లో మేకర్స్ మరియు బయ్యర్లు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.