Begin typing your search above and press return to search.

టైగర్.. అక్కడ హైప్ లేదా?

అసలు టైగర్​ నాగేశ్వరరావుకు అక్కడ హైప్​ లేదని ఇలా చేస్తున్నారా? లేక కావాలనే మన - తన భేదం చూపిస్తూ స్క్రీన్స్​ను ఇవ్వట్లేదా? వారికే తెలియాలి.

By:  Tupaki Desk   |   13 Oct 2023 2:45 AM GMT
టైగర్.. అక్కడ హైప్ లేదా?
X

ఇంకో ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న పాన్​ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ల కోసం మాస్​ మహారాజా రవితేజ సౌత్​ టు నార్త్​ అన్ని ప్రధాన నగరాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఈవెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఈ చిత్రానికి తమిళంలో, కన్నడంలో కనీస థియేటర్లు కూడా దొరకలేదని ప్రచారం సాగుతోంది.

19నే తమిళంలో దళపతి విజయ్​ లియో, కన్నడంలో శివ రాజ్​కుమార్​ ఘోస్ట్​.. వస్తున్న కారణంగా డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా ఈ చిత్రాలకే స్క్రీన్లు బ్లాక్ చేసి కేటాయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు మాస్ మహారాజ్​ అభిమానులను ఇతర సినీ ప్రియులను బాధపెడుతున్నాయి. సరే సొంత సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. మన చిత్రాలకు స్క్రీన్స్​ దొరకట్లేదనే వాదనలు వినిపిస్తున్నారు.

మరి అదే సమయంలో వారి చిత్రాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. మరి వాళ్లకెలా మనదగ్గర స్క్రీన్స్​, థియేటర్లు దొరుకున్నాయి. అది కూడా హెవీ కాంపీటిషన్​లోనూ. ఈ దసరాకు భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ చిత్రం లియోకు బాగానే థియేటర్లు దొరికాయి. ఘోస్ట్​కు కూడా పర్వాలేదనిపించేలా స్క్రీన్స్ దొరకాయని టాక్​. అలా మనం మాత్రం స్ట్రెట్ - డబ్బింగ్ అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ఆదరిస్తుంటే... ముఖ్యంగా కోలీవుడ్ ఆడియెన్స్​ మాత్రం వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తున్నారు.

అసలు టైగర్​ నాగేశ్వరరావుకు అక్కడ హైప్​ లేదని ఇలా చేస్తున్నారా? లేక కావాలనే మన - తన భేదం చూపిస్తూ స్క్రీన్స్​ను ఇవ్వట్లేదా? వారికే తెలియాలి. వాస్తవానికి కన్నడ చిత్ర పరిశ్రమను ఇలాంటి సమస్య మనకు ఎక్కువగా ఎదురైనట్టు పెద్దగా దాఖలాలు కనపడేలు కానీ తమిళంలో మాత్రం బాగా కనపడుతుంది.

అక్కడ పెద్ద స్టార్ల సినిమాలతో మన వాళ్ళు పోటీకి వెళ్లిన ప్రతిసారి స్క్రీన్ల్ విషయంలో ఇదే ఇబ్బంది తీవ్రంగా ఎదురవుతోంది. లేదంటే కాస్త ప్రాధాన్యం మనకు దక్కాలంటే వారు లేని సమయంలోనే విడుదల చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. చూడాలి మరి ఈ సమస్య ఎలా, ఎప్పుడు తొలిగిపోతుందో...