Begin typing your search above and press return to search.

బిగ్​ బాస్​లో టైగర్ జోరు.. నాగ్​ తో ఇలా..

మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా నటించిన లేటెస్ట్​ మూవీ టైగర్ నాగేశ్వరరావు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 6:43 AM GMT
బిగ్​ బాస్​లో టైగర్ జోరు.. నాగ్​ తో ఇలా..
X

మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా నటించిన లేటెస్ట్​ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్​పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటం వల్ల ప్రమోషన్స్​లో జోరు పెట్టింది మూవీటీమ్. రవితేజ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా ప్రమోషన్స్​లో భాగంగా మూవీటీమ్​.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్​ బాస్ 7లోనూ సందడి చేయనుంది.

ఈ షోకు సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. నేడు వీకెండ్ షో కావడం వల్ల సాయంత్రం ప్రసారం కానున్న షోలో రవితేజ అండ్ టీమ్​.. నాగార్జునతో కలిసి బిగ్ బాస్ 7 స్టేజ్​ను షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే షూట్ పూర్తైన ఈ సాలిడ్ ఎపిసోడ్​లో టైగర్ నాగేశ్వరరావు స్టేజ్​పై ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కూడా చేశారట. అలాగే షూట్ గ్యాప్​లో నాగ్​తో కలిసి కూర్చొని ముచ్చట్లు కూడా బానే పెట్టారని తెలిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్స్ నెట్టింట వైరల్​గా మారాయి. అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా, వంశీ తెరకెక్కించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే సంజ్ఞా భాష( ఇండియన్ సైన్‌ లాంగ్వేజ్‌)లోనూ రిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించగా.. . ఆర్‌.మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

జీషూ సేన్ గుప్తా, రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే రవితేజ బాలీవుడ్ అరంగేట్రం చేయనండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.